MoviesTollywood news in telugu

Pawan kalyan గబ్బర్‌సింగ్‌ సినిమా అంత్యాక్షరి ఐడియా ఎవరిదో తెలుసా ?

Pawan kalyan gabbar singh dialogues : పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లో టాప్‌ చిత్రాల జాబితాలో గబ్బర్‌ సింగ్‌ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో పవన్‌ కళ్యాణ్‌ స్క్రిప్ట్‌ విషయంలో మరియు స్క్రీన్‌ప్లే విషయంలో పలు సలహాలు సూచనలు చేయడం జరిగింది. అంతకు ముందు పవన్‌ కళ్యాణ్‌ చేసిన వరుస నాలుగు సినిమాలు డిజాస్టర్‌ అయ్యాయి.

అందుకే ఈ సినిమాపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాడు. స్క్రీన్‌ప్లే చర్చల సమయంలో పలు కీలక మార్పులు చేర్పులను చెప్పాడు. గబ్బర్‌సింగ్‌ సినిమా విడుదల సమయంలో మొదట మిశ్రమ స్పందన దక్కించుకున్నా ఆ తర్వాత సినిమాకు బ్లాక్‌ బస్టర్ టాక్ వచ్చింది. ఏకంగాఇండస్ట్రీ హిట్ కొట్టింది. అంతటి విజయానికి ప్రధాన కారణం సినిమాలోని అంత్యాక్షరి సీన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ కామెడీ సన్నివేశంను పవన్‌ స్వయంగా సూచించాడట.సాదా సీదాగా ఆ ఎపిసోడ్‌ను పూర్తి చేయాలనుకుని దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్క్రిప్ట్‌లో అనుకున్నాడు. కాని పవన్‌ కళ్యాణ్‌ ఆ సమయంలో రౌడీ గ్యాంగ్‌తో అంత్యాక్షరి ఆడుతూ వారి నుండి నిజం రాబడితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఆ నిర్ణయం అందరికి నచ్చడంతో దాన్నే ఫాలో అయ్యారు. పవన్‌ సూచనతోనే సినిమా అంతటి హిట్‌ అయ్యిందంటూ దర్శకుడు హరీష్‌ శంకర్‌ కూడా పలు సందర్బాల్లో సన్నిహితుల వద్ద అన్నాడట.