MoviesTollywood news in telugu

Tollywood:టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయినా సరే.. ఈ రోల్స్ ఎందుకు వదులుకున్నారో తెలుసా?

Tollywood Famous Roles In Telugu :ఏ పాత్ర ఎవరికి రాసిపెట్టి ఉందొ చెప్పడం కష్టం. ఫలానా హీరో, హీరోయిన్ దృష్టిలో పెట్టుకుని కథ అనుకున్నా, చివరకి వేరేవాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. తీరా ఆసినిమా హిట్ అయితే అయ్యో చేజారిందే అనే బాధ ఉండిపోతుంది. అలాంటివాటిలో కొన్నింటిని ప్రస్తావిస్తే, 16ఏళ్ల వయస్సు మూవీ శ్రీదేవి సరసన చంద్రమోహన్ చేశారు.

అయితే తమిళంలో కమల్ వేసిన ఈ పాత్రను తెలుగులో శోభన్ బాబు వేయాలని అనుకున్నా, డీ గ్రామర్ అవుతుందని చెప్పడంతో వెనకడుగు వేశారు. దాంతో చంద్రమోహన్ సెట్ అయ్యాడు. సితార మూవీ ని డైరెక్టర్ వంశీ తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రాధను అనుకున్నారట.

అప్పటికే తమిళంలో ఫేమస్ హీరోయిన్ గా ఉంటూ, తెలుగులోనూ రాణిస్తోంది. కానీ రెమ్యునరేషన్ ఎక్కువ అడగడంతో మరో హీరోయిన్ ని చూడాలని భావించడంతో భానుప్రియ చేతికి వెళ్లి సూపర్ హిట్ అయింది. ఇక అహనా పెళ్ళంట మూవీని హాస్య బ్రహ్మ జంధ్యాల తెరకెక్కించగా, సూపర్ హిట్ అయింది.

ఇందులో కోట శ్రీనివాసరావు వేసిన పాత్రకోసం రావుగోపాలరావు ని అనుకుంటే, ఆ సీన్ తనకు సెట్ కాదని భావించడంతో కోట రంగంలోకి వచ్చి, కెరీర్ లో మైలురాయిగా మలుచుకున్నారు. నాగార్జున ట్విన్స్ గా నటించిన హలోబ్రదర్ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ లో ఒక రోల్ కోసం రోజాను అనుకున్నారు.

అయితే సొంత సినిమా సమరం మూవీతో బిజీగా ఉండడం వలన వదిలేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్నీ ఓ ఇంటర్యూలో స్వయంగా రోజా చెప్పుకొచ్చారు. ఇక స్వాతికిరణం తర్వాత తెలుగులో ముమ్ముట్టి ఎన్ని ఛాన్సులు వచ్చినా చేయలేదు. ప్రస్థానం మూవీకోసం అడిగితె కాదనడంతో సాయికుమార్ కి వెళ్ళింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."