Kitchenvantalu

Godhuma Rava Upma:గోధుమ రవ్వ ఉప్మా సరైన కొలతలతో.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ డిష్‌ను తీసుకుంటే..

Godhuma Rava Upma:గోధుమ రవ్వ ఉప్మా..ఈజీగా హెల్తీగా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఆఫ్షన్ ఏదైనా ఉందంటే గోధుమ రవ్వ ఉప్మానే. పిల్లలకి ,పెద్దలకి,బ్రేక్ ఫాస్ట్ అయినా ,లంచ్ అయినా అన్నింటికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.

కావాల్సిన పదార్ధాలు
గోధుమ రవ్వ – 1 కప్పు
నెయ్యి – 1 స్పూన్
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – ½ టీ స్పూన్
జీలకర్ర – ½ టీ స్పూన్
మినపప్పు – 2 టీ స్పూన్స్
శనగపప్పు – 2 టీ స్పూన్స్
అల్లం ముక్కలు – 1 టీ స్పూన్
ఉల్లిపాయ -1
పచ్చిమర్చి – రుచికి సరిపడా
క్యారేట్ ముక్కలు – 2
బంగాళదుంపలు—1
ఉప్పు – రుచికి సరిపడా
పుదీనా – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నెయ్యిని వేడి చేసుకోవాలి.
2.అందులోకి గోధుమ రవ్వను వేసి వేయించుకోని పక్కన పెట్టుకోవాలి.
3.అదే ప్యాన్ లో ఆయిల్ వేడిచేసి పల్లీలు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,శనగపప్పు,అల్లం తరుగు,ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,కూరగాయ ముక్కలు వేసి వేపుకోవాలి.
4.లో ఫ్లేమ్ పై ఐదు నిమిషాలు కూరగాయలను ఉడికించి ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల నీళ్లను యాడ్ చేసుకోవాలి.

5.ఉప్పు వేసి మూత పెట్టి ఎసరు మరగనివ్వాలి.
6.మరిగిన నీటిలో వేపి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసి మీడియం ఫ్లేమ్ ఉడికించాలి.
7.ఉప్మా దగ్గర పడ్డాక,పుదీనా,కొత్తిమీర ఆకులను వేసి కలుపుకోవాలి.
8.అంతే హెల్తీ అండ్ టేస్టీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ.