MoviesTollywood news in telugu

Pawan Kalyan గబ్బర్ సింగ్ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరు?

Power Star Pawan Kalyan gabbar singh Movie : పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎన్ని రోజులు అయినా ఎదురు చూస్తూ ఉంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

శృతిహాసన్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఏకంగా 63కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి విక్టరీ వెంకటేష్ కారణమని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా కలియుగ పాండవులు మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించాడు.

డిఫరెంట్ మూవీస్ చేసి మెప్పించాడు. చినరాయుడు, చంటి, సూర్యవంశం, బొబ్బిలి రాజా, సుందరకాండ, కలిసుందాం రా, ప్రేమించుకుందాం రా, లక్ష్మి , దృశ్యం.. ఇలా విభిన్న సినిమాలతో అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు వెంకీ.

అయితే ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసి హిట్స్ కొట్టిన వెంకీ కి హిందీలో హిట్ అయిన మూవీని తెలుగులో గబ్బర్ సింగ్ గా తీయడానికి ప్లాన్ చేస్తుంటే, తన కంటే పవన్ కి ఈ క్యారెక్టర్ సూటవుతుందని చెప్పాడట. దాంతో పవన్ తో తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. అలా గబ్బర్ సింగ్ విజయం వెనుక వెంకీ ఉన్నాడని తేలింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."