MoviesTollywood news in telugu

Venkatesh ఆప్యాయంగా భుజంపై చేతులు వేసిన ఆ కుర్రాడెవ‌రో గుర్తు పట్టారా?

Venkatesh And Sumanth Unknown facts : తమ అభిమాన హీరోల గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి చాలా ఆసక్తిని చూపుతారు. విక్ట‌రీ వెంక‌టేష్ ఆప్యాయంగా భుజంపై చేతులు వేసిన ఆ కుర్రాడు..టాలీవుడ్‌లో హీరో. రెండు ద‌శాబ్దాల నుంచీ సినీ పరిశ్రమలో ఉన్న‌ప్ప‌టికీ.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆయన కేరీర్‌లో కొట్టిన హిట్లు  మాత్రం నాలుగైదుకు మించ‌వు.

ఆ హీరో మ‌రెవ‌రో కాదు. అక్కినేని నాగేశ్వరరావు మనవుడు సుమంత్. అక్కినేని మనవుడు నాగార్జున మేనల్లుడుగా సినీ పరిశ్రమకు ప్రేమకథ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమకథ సినిమాను నాగార్జున సొంత బేనర్ లో నిర్మించాడు.

ఆ సినిమా పర్వాలేదని అనిపించింది. కానీ కథల ఎంపికలో చేసిన తప్పుల కారణంగా సుమంత్ కాస్త వెనక పడ్డాడని చెప్పవచ్చు. కెరీర్ ఆలా ఆలా సాగుతున్న సమయంలో కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. వారి మధ్య అభిప్రాయ భేదాలు రావటంతో విడిపోయారు.

ఆ తరవాత కూడా సినిమాలు చేసిన ఎక్కువ దృష్టి పెట్టకపోవడం వలన ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ మధ్య గోల్కొండ హైస్కూల్ తో హిట్ కొట్టాడు సుమంత్.

మరల ఇప్పుడు `మ‌ళ్లీ రావా..` సినిమా సుమంత్‌కు కొత్త ఊపిరి పోసింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా… ఈ మధ్య సీతా రామం సినిమాలో నటించి తన సత్తా ఏమిటో నిరుపించుకొని ముందుకు సాగుతున్నాడు. ఇలాగే మంచి మంచి సినిమాలు సుమంత్ చేయాలనీ కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."