Beauty Tips

Hair Care Tips:ఈ నూనెతో మసాజ్ చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు 3 రెట్లు వేగంగా పెరుగుతుంది

Amla and Alovera Hair Growth In Telugu : జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, తెల్లజుట్టు సమస్య అనేవి ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తున్నాయి. ఈ సమస్యలు తగ్గించుకోవటానికి మన ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగించవచ్చు.

పొయ్యి వెలిగించి ముకుడు పెట్టి 50 ఎం‌ఎల్ కొబ్బరి నూనె, 25 ఎం‌ఎల్ బాదం నూనె వేసి కొంచెం వేడి అయ్యాక 6 ఉసిరికాయలను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 5 అంగుళాల కలబందను ముక్కలుగా కట్ చేసి వేసి మరిగించాలి. కలబంద ముక్కలు, ఉసిరి ముక్కలు నల్లగా మారే వరకు వేగించాలి.

ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి నూనె చల్లారాక సీసాలో వడకట్టాలి. ఈ నూనెను ప్రతి రోజు జుట్టుకి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్రతి రోజు చేయటం వలన జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషణ అంది జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

కలబందలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ (బీటా కెరోటిన్), సి మరియు ఇ సమృద్దిగా ఉండుట వలన జుట్టుకు అవసరమైన పోషణను అందించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తోంది. అలాగే తలలో రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టును బలోపేతం చేస్తుంది. కలబంద ప్రొటీలిటిక్ ఎంజైమ్లను కలిగి ఉంటుంది. ఇది తలపై దెబ్బతిన్న కణాలను నయం చేయడానికి సహాయపడుతుంది.

ఉసిరిలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల జుట్టు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. ఇంకా ఇది హెయిర్ టానిక్ లా పనిచేసి జుట్టును స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే హెయిర్ పిగ్మెంటేషన్ తో పోరాడి, తెల్ల జుట్టును నివారిస్తుంది. ఉసిరికాయలో ఉండే విటిమిన్ సి తలలో పోషణను అందిస్తుంది.

కొబ్బరి నూనె సహజమైన కండీషనర్ గా పనిచేసి జుట్టును మృదువుగా మరియు మెరిసేలా ఉంచడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. తలలో దురద, చుండ్రు, ఎర్రబారడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."