MoviesTollywood news in telugu

Kalyani:ఆ సినిమాలో చీరలను కల్యాణి ఎందుకు తీసుకువెళ్లిందో తెలుసా?

Avunu valliddaru ishtapaddaru movie Kalyani :సినిమాలకు సంబందించిన విషయాలను తెలుసుకోవటానికి మనలో చాలా మంది చాలా ఆసక్తిగా ఉంటారు. సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో వాడిన డ్రెస్ లను వదిలేసి వెళ్లిపోవడం ఆనవాయితీ. అయితే కొందరు తమ ఇళ్లకు పట్టుకు పోతుంటారు. కొందరికైతే మూవీ మేకర్స్ కానుకగా ఇచ్చేస్తారు.

రవితేజ హీరోగా నటించిన వంశీ డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీలో హీరోయిన్ గా కళ్యాణి చేసింది. ఈ సినిమాలో తాను కట్టిన చీరలన్నీ కాటన్ వే. చాలా బాగున్నాయని ఆమె ముచ్చట పడడంతో వాటిని ఆమెకు ఇచ్చేసారట. వాటిని పట్టుచీరలు పట్టుకెళ్లినంత ఆనందంగా ఆమె తీసుకెళ్లడం విశేషం.

అసలు అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీ తీయడమే ఒక విశేషం దాగుంది. అప్పటికీ వరుస ప్లాప్ లు చవిచూసిన డైరెక్టర్ వంశీ ఇక సినిమా పరిశ్రమలో ఉండలేక యానాం వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో వేమూరి సత్యనారాయణ ఫోన్ చేసి, హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ బాగానే ఉందని, తమ ఊరికే చిందిన వేమూరి రమేష్ ఒక సినిమా మీతో చేయాలని అనుకుంటున్నాడని చెప్పడంతో ఆగిపోయారు.

కథ సిద్ధం చేస్తున్న సమయంలో వేమూరి రమేష్ మళ్ళీ అమెరికా వెళ్లిపోవడంతో వంశీ డైలమాలో పడ్డాడు.ఈ లోగా గంగోత్రి ఉపాధ్యాయ చెప్పిన కథను ఆధారం చేసుకుని హీరో శివాజితో మూవీ చేయాలని వంశీ అనుకున్నాడు. మరోవైపు మహర్షి మూవీకి మేనేజర్ గా చేసిన వల్లూరిపల్లి రమేష్ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాలని భావించడంతో రవితేజను హీరోగా సెలక్ట్ చేసారు.

హీరోయిన్ గా లయను అనుకున్నా కల్యాణిని సెలక్ట్ చేసారు. కాకినాడకు చెందిన పాపారావు చౌదరిని రైటర్ గా,నటుడిగా ఎంట్రీ ఇప్పిస్తూ, కృష్ణ భగవాన్ గా పేరు మార్చారు. విశాఖ పోర్టులో పనిచేసి రిటైరైన కొండవలస లక్ష్మణరావు ని ఐతే ఒకే డైలాగ్ ప్రాక్టీస్ చేయించి, సినిమాలోకి తీసుకున్నారు.మొత్తానికి వంశీ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని ఇండస్ట్రీలో కొనసాగాడు.