Kitchenvantalu

Paneer Biryani:రెస్టారెంట్ రుచితో పనీర్ బిర్యానీ చేయండి.. రుచి సూపర్..

Paneer Biryani:పన్నీర్ బిర్యానీ..వెజ్ బిర్యానీలో స్పెషల్ అంటే పన్నీర్ బిర్యానీ అనే చెప్పాలే.పన్నీర్ బిర్యానీ ఈజీగా ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
బాస్మతి రైస్ – 2 కప్పులు
పన్నీర్ – 300 గ్రాములు
ఉల్లిపాయలు – 3
పెరుగు – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
పుదీనా – ½ కప్పు
ఉడికించిన బఠానీలు – ½ కప్పు
క్యారెట్స్ – ½ కప్పు
ఉప్పు – 2 టీ స్పూన్స్
నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్స్
కారం – 2 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి – 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 ½ టీస్పూన్
ధనియాల పొడి – 2 టీ స్పూన్స్
గరంమసాలా – ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
దాల్చిన చెక్క – 3 ఇంచ్ లు
యాలకులు – 3
లవంగాలు – 5
షాజీరా – 1 టీ స్పూన్
బిర్యానీ ఆకులు – 3

తయారీ విధానం
1.ముందుగా బాస్మతి రైస్ ని అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2.పన్నీర్ ను ముక్కలుగా కట్ చేసి వేపుకోని పెట్టుకోవాలి.
3.ప్యాన్ లో నూనే వేడి చేసి అందులోకి ఉల్లిపాయ చీలికలు డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి కప్పు పెరుగు వేసి బీట్ చేసుకోవాలి.
5.అందులోకి కారం,ఉప్ఉప,ధనియాలపొడి,జీలకర్ర పొడి,గరంమసాలా,పసుపు,అల్లం వెల్లుల్లి పేస్ట్,పన్నీర్ వేసి కలుపుకోవాలి.
6.ఇప్పుడు అందులోకి నిమ్మరసం నూనె ,పచ్చిమిర్చి,వేపుకున్న ఉల్లిపాయలు,కొత్తిమీర,పుదీనా,ఉడికించిన బఠానీలు ,క్యారేట్,ఇతర కూరగాయలు వేసి బాగా మిక్స్ చేసుకోని పావు గంటపాటు పక్కన పెట్టుకోవాలి.
7.ఇప్పుడు రైస్ కోసం ప్యాన్ లో సగం వరకు నీళ్లను వేసి అందులోకి ఓల్ గరం మసాలా ,ఉప్పు వేసి మూతపెట్టి ఎసరు మరగనివ్వాలి.

8.మరుగుతున్న ఎసరులో నాన బెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 70 శాతం రైస్ ఉడికించుకోవాలి.
9.ఇప్పుడు మందపాటి అడుగున్న గిన్నెను తీసుకోని అడుగున నెయ్యిని అప్లై చేసుకోవాలి.
10.ఇప్పుడు నీటిని వడకట్టి రైస్ ని జల్లిగరిట సాయంతో ప్యాన్ అడుగున పొరలాగా వేసుకోవాలి.
11.దాని పై మారినేట్ చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి.
12.ఆ పై వేపిన ఉల్లిపాయలు,పూదీనా ఆకులు నెయ్యి ని వేసి మూత పెట్టుకోని దాని పై ఆవిరి పోకుండా ఏదైనా బరువును ఉంచండి.
13.ప్యాన్ తక్కువ మంటపై ఐదు నిమిషాలు వేడి చేసి బిర్యాని కింద మరోప్యాన్ వేసి పదినిమిషాలు ఎక్కువ మంట పై ఉడికించుకోవాలి.
14.ఇప్పుడు లో ఫ్లేమ్ పై పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి,
15.స్టవ్ ఆఫ్ చేసుకోని పది నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ బిర్యానీ రెడీ.