Kitchenvantalu

Ragi Laddu:రాగిపిండితో ఇలా లడ్డు చేసి చూడండి.. సూపర్ టేస్టీగా ఉంటుంది

Ragi Laddu:రాగి లడ్డులు..ఎముకలకు బలాన్నిచ్చే రాగులను పిల్లలు ,పెద్దలు రోజువారి ఆహరంలో యాడ్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యం.ముఖ్యంగా పిల్లల కోసం రాగులతో లడ్డూలను తయారు చేసి పెట్టండి.రాగి లడ్డులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
రాగి పిండి – 2 కప్పులు
తురుమిన బెల్లం – 1 కప్పు
నెయ్యి – ½ కప్పు
జీడిపప్పు – తగినన్ని
బాదం – తగినన్ని

తయారీ విధానం
1.ముందుగా డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి.
2.అదే ప్యాన్ లోకి రాగిపిండిని వేసి సువాసన వచ్చే వరకు వేపుకోవాలి.
3.ఇప్పుడు మిక్సి జార్ లోకి బెల్లం తురుము రాగి పిండిని సమపాల్లలో యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి.
4.ఇప్పుడు పొడి చేసుకున్న రాగిపిండి ,బెల్లం ప్లేట్ లోకి తీసుకోవాలి.
5.ఇప్పుడు అందులోకి వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ,యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
6.ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తు రాగిపిండిని లడ్డులుగా చుట్టుకుంటే రాగి లడ్డులు రెడీ.