Brown Rice Khichdi:ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు బ్రౌన్ రైస్‌తో కిచిడి..
Brown Rice Khichdi;బ్రౌన్ రైస్ కిచిడి.. డైట్ లో భాగంగా చాలా మంది రైస్ కి బదులుగా బ్రౌన్ రైస్ వాడుతున్నారు. బ్రౌన్ రైస్ తో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
బ్రౌన్ రైస్ – 2 కప్పులు
కంది పప్పు – 1 కప్పు
ఉడికించిన పచ్చి బఠానీలు – ½ కప్పు
క్యారేట్ – ½ కప్పు
టొమాటో- ½ కప్పు
బంగాళదుంప – ½ కప్పు
క్యాప్సికం – ½ కప్పు
పచ్చిమిర్చి – 4
ఉల్లిపాయలు – ½ కప్పు
కొత్తిమీర – ½ కప్పు
పుదీనా – ½ కప్పు
ఓల్ గరంమసాలా – రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ½ టీ స్పూన్
తయారీ విధానం
1.ముందుగా బ్రౌన్ రైస్ ని,కంది పప్పుని గంట పాటు నానబెట్టుకోవాలి.
2.ఇప్పుడు కుక్కర్ లోకి నెయ్యి వేసి వేడెక్కాక అందులోకి ఓల్ గరం మసాలా వేసి వేపుకోవాలి.
3.మసాలా వేగాక పచ్చిమిర్చి ,ఉల్లిపాయలు,వేసి మెత్తపడే వరకు వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగాక పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,బఠానీ,క్యారేట్,క్యాప్సికం,బంగాళదుంప ముక్కలు వేసి రెండు,మూడు నిమిషాలు వేపుకోవాలి.
5.ఇప్పుడు టమాటో ముక్కలు వేసి మెత్తపడే వరకు ఉడికించాలి.
6.టమాటోలు మెత్తపడ్డాక బ్రౌన్ రైస్ ,కందిపప్పును వేసి కలుపుకోవాలి.
7.అందులోకి పుదీనా కొత్తిమీర ఆరు కప్పుల నీళ్లను పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
8.కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే.