MoviesTollywood news in telugu

Tollywood:నరసింహనాయుడు Vs ఖుషి.. బాక్సాఫీసు షేక్ చేసిన మూవీ ఏది?

Narasimha Naidu and Khushi: తెలుగు ఇండస్ట్రీలో కొన్ని వివాదాలు ఎప్పటికీ తేలవు. ఎవరి రేంజ్ లో వాళ్ళు వాదన చేస్తుంటారు. అందులో నందమూరి బాలయ్య నటించిన నరసింహనాయుడు,పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి టాపిక్ కూడా ఉంది.

ఖుషి ఇండస్ట్రీ హిట్ గా పవన్ ఫాన్స్ వాదిస్తారు. అయితే నరసింహనాయుడిని ఖుషి క్రాస్ చేసిందా లేదా అనేది చూద్దాం. తెలుగు సినీ చరిత్రలో నరసింహనాయుడు మొదటిసారి 20కోట్ల షేర్ వసూలు చేసిన మూవీగా నిల్చింది. మొత్తం మీద 22కోట్ల వరకూ షేర్ వసూలు రాబట్టింది. 105కేంద్రాల్లో 100రోజులు ఆడింది.

ఇక నరసింహనాయుడు వందరోజులు ఆడిన తర్వాత ఖుషి విడుదలైంది. సంచలన విజయాన్ని నమోదుచేస్తూ 20కోట్లకు పైనే షేర్ వసూలు చేసింది. ఒక్క నైజాంలోనే 8కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 79కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. అయితే నరసింహనాయుడు వంద రోజుల రికార్డ్ ని క్రాస్ చేయలేదు.

అయితే కలెక్షన్స్ పరంగా నైజాం,కృష్ణ జిల్లాల్లో నరసింహనాయుడిని క్రాస్ చేసేసింది. మిగిలిన ఏరియాల్లో క్రాస్ చేయలేకపోయింది. దీంతో 21కోట్లకు పైనే వసూలు చేసి ఆల్ టైం టాప్ టు మూవీగా నిల్చింది.

మొత్తానికి ఖుషి ఇండస్ట్రీ హిట్ అని ఎవరూ అనలేదు సరికదా ప్రొడ్యూసర్స్ కూడా చెప్పుకోలేదు. అయితే సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఖుషి ఇండస్ట్రీ హిట్ గా కొన్ని వెబ్ సైట్స్ లో ప్రచారం సాగింది. దీన్ని పవన్ ఫాన్స్ ఫాలో అయిపోతున్నారు. నైజాం లో రెండున్నర కోట్లు నైజాం లో ఖుషి ఎక్కువ వసూలు చేసిందని లాజిక్ చెబుతున్నారు. నైజాంలో రెండున్నర కోట్లే కాదు, కృష్ణా 30లక్షలు ఖుషి వసూలు చేసింది.

అయితే మిగిలిన అన్ని చోట్లా నరసింహ నాయుడే లీడ్ లో ఉంటుంది. సీడెడ్ లో 1.2కోట్లు,గుంటూరులో 75లక్షలు,ఉత్తరాంధ్ర 40లక్షలు కర్ణాటకలో 70లక్షలు, నెల్లూరు – ఈస్ట్ – వెస్ట్ లో 40లక్షలు ఇలా నరసింహనాయుడు లీడ్ లో ఉంటుంది.

కానీ మొత్తం మీద కొన్ని లక్షల్లోనే రెండు సినిమాలు తేడా ఉంటుంది. ఇక సెంటర్స్ పరంగా ఇండస్ట్రీ రికార్డ్ చూస్తే ఖుషి వెనుకబడే ఉంటుంది. పైగా 101సెంటర్స్ లో వంద రోజులు ఆడిద్దామని ఏ ఎం రత్నం అంటే అలాంటివి మనకొద్దని పవన్ చెప్పడం ద్వారా ఫేక్ రికార్డ్స్ కి వ్యతిరేకమని తేల్చాడని చెబుతారు.