Healthhealth tips in telugu

Heel Pain:మడమ నొప్పిని నిమిషంలో మాయం చేసే ఆకు…ఇలా చేస్తే సరిపోతుంది

Home Remedies for Heel Pain In telugu : ప్రస్తుత కాలంలో మారిన జీవన పరిస్థితులు కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మడమ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు,సరైన పోషకాహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో మడమ నొప్పి వస్తుంది. మడమ నొప్పి అనేది చాలా బాధాకరంగా ఉంటుంది.

ప్రతి రోజు మన జీవితంలో ప్రతి కదలిక మడమలోని కీలు సహాయంతో జరుగుతుంది. మడమ ఎముకలో మార్పు రావటంవలన మడిమనొప్పితో కదలికలు కష్టంగా మారుతుంది.ఉదయం సమయంలో మంచంపై నుంచి కాలు కింద పెట్టగానే అడుగు తీసి అడుగు వేయలేనంత విపరీతమైన నొప్పి ఉంటుంది.

పది నిముషాలు ఆలా అటు ఇటు తిరిగితే కాస్త తగ్గుతుంది. దీని కోసం మందులు వాడకుండా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఈ రెమిడీ కోసం గోరింటాకు,ఆముదం ఉపయోగిస్తున్నాం. గోరింటాకు ఆకులను కోసి శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఈ గోరింటాకు ఆకులను ఆముదంలో వేసి బాగా మరిగించాలి. గోరింటాకు బాగా వేగేవరకు వేగించాలి.

ఈ నూనెను వడకట్టి మడమ నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేసుకొని,ఆ తరవాత వేగిన గోరింటాకును మడమ నొప్పి ఉన్న చోట పట్టులా వేసి గట్టిగా కట్టు కట్టాలి. ఈ విధంగా రెండు,మూడు రోజుల పాటు చేస్తే మడమ నొప్పి తగ్గిపోతుంది. ఇలా చేస్తూ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెత్తటి కుషన్ చెప్పులను వాడాలి.

మడమలో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు పది నిమిషాలసేపు ఐస్ ముక్కతో పాదానికి కాపడ౦ పెట్ట౦డి. వ్యాయామ౦ కోస౦ నడక కన్నా సైకిల్ తొక్కట౦, ఈదట౦ లా౦టి ఇతర మార్గాలను ఎంచుకోవాలి. మడమ నొప్పి బాగా ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పిన రెమిడీ ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.