Healthhealth tips in telugu

Headache:తలనొప్పిని నిమిషాల్లో తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు

Headache Home Remedies:తలనొప్పి చిన్న సమస్య అయినా ఒక్కసారి విపరీతమైన భరించలేనంత నొప్పి ఉంటుంది.నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో కూడా తలనొప్పి వస్తుంది. తలనొప్పిగా ఉంటే ఏ పని చేయలేం. అలాగే పని మీద దృష్టి పట్టడం కూడా కష్టమే.

అందుకే తల నొప్పి ప్రారంభంకాగానే ప్రతి ఒక్కరూ టాబ్లెట్ వేసుకుంటారు. అయితే ఎక్కువగా టాబ్లెట్లు వేసుకుంటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అందుకే ఇంటి చిట్కాల ద్వారా తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి తాగితే తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.తల నొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక స్కూల్ వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకు నీటిని తాగుతూ ఉండాలి.బాదం పప్పు, వాల్ నట్స్ వంటి నట్స్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ చిట్కాలు పాటించండి. అయినా సరే తల నొప్పి తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."