Beauty Tips

Stretch marks remedies: స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఈ టిప్స్ ఫాలో అయిపోండి..

Stretch marks remedies: పసుపును అన్ని రకాల చర్మ తత్వాలు ఉన్నవారు ఉపయోగించవచ్చు. పసుపులో యాంటి సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మొటిమలను తొలగించి చర్మం కాంతివంతంగా మారేలా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

పసుపులో బ్లీచింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. కొంచెం పసుపులో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్ట్ గా చేసి పిగ్మెంటేషన్ ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత సాధారణమైన నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. కాలిన గాయాలపై పసుపును ఆలివ్ ఆయిల్ లో కలిపి రాస్తే తొందరగా మానతాయి. పసుపు ముడతలను కూడా సమర్ధవంతంగా తొలగిస్తుంది. ఒక స్పూన్ పసుపులో బియ్యంపిండి,టమోటా రసం,పాలు కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముడతలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలాగే చర్మంలో అధికంగా ఉన్న జిడ్డును కూడా తొలగిస్తుంది. పసుపు స్ట్రెచ్ మార్కులను  తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పసుపును శనగపిండి మరియు పాలతో కలిపి పేస్ట్ గా చేసి  స్ట్రెచ్ మార్కులు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక రబ్ చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.