MoviesTollywood news in telugu

టివి యాంకర్లుగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్స్ గా మారిన తారలు వీరే…ఒక లుక్ వేయండి

Tv Anchors Turn Heroines:సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురు చూసేవారు చాలా మంది ఉంటారు. కొంతమంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందడుగు వేసే వాళ్ళు ఉంటారు. టీవీ యాంకర్ గా కెరీర్  స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమా  హీరోయిన్ గా కెరీర్ ని ప్లాన్ చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.

రష్మీ మొదటిసారిగా 2007లో వనిత టీవీలో యువ అనే ప్రోగ్రాం తో యాంకర్ కెరీర్ స్టార్ట్  చేసి ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తూ ముందుకు సాగుతుంది. ఒక పక్క టివీ రంగం మరో పక్క సినిమా రంగంలో రాణిస్తుంది.

ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న నయనతార కూడా ఒకప్పుడు తమిళ ఛానల్లో యాంకర్ గా పనిచేసింది.

యాంకర్ గా కెరీర్  ని స్టార్ట్ చేసిన శ్రీముఖి 2015 లో చంద్రిక సినిమాలో హీరోయిన్ గా చేసింది.

రెజీనా కూడా మొదటగా టీవీ యాంకర్ గానే పపనిచేసింది.  ఒక క్విజ్  ప్రోగ్రాం కు యాంకర్ గా పనిచేసి ఆ తర్వాత సినిమా రంగానికి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియదు.

కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కలర్స్ ఛానల్ లో వచ్చే ఓ ప్రోగ్రాం కు యాంకర్ గా పనిచేసి మంచి గుర్తింపుని తెచ్చుకుంది.  యాంకర్ గా చేసిన తర్వాత వచ్చి చాలా సినిమాలు చేసింది. మొదట చిన్న చిన్న పాత్రలు  వేసి ఆ తర్వాత హీరోయిన్ గా చేసింది.

నాగబాబు కూతురు నిహారిక కూడా మొదట యాంకర్ గా కెరీర్  స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం వెబ్ సిరిస్ లతో బిజీగా ఉంది.

అనసూయ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమా రంగంలో తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అనసూయ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. అప్పటి నుండి, ఆమె ‘రంగస్థలం’ మరియు ‘కథనం’ వంటి చిత్రాలలో చిరస్మరణీయమైన నటనను అందించి, యాంకర్‌గా మరియు నటిగా తన కెరీర్‌ను విజయవంతంగా సాగిస్తుంది.