Beauty Tips

Hair Care Tips:చలి కాలంలో ఇలా చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి 3 రెట్లు వేగంగా జుట్టు పెరుగుతుంది..

Hair Fall Tips In telugu : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టి రక రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులతో చాలా సులభంగా జుట్టు ఎయాలే సమస్య నుండి బయట పడవచ్చు. కలబంద మట్టను తీసుకుని శుభ్రంగా కడిగి అంచులను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కలబంద ముక్కలు దాదాపుగా అరకప్పు ఉండేలా చూసుకోవాలి.

మిక్సీ జార్ లో కలబంద మొక్కలు, ఒక ఉల్లిపాయను కట్ చేసి వేయాలి. ఆ తర్వాత నాలుగు లేదా ఐదు కరివేపాకు రెబ్బలను తీసుకుని శుభ్రంగా కడిగి ఆకులను విడదీసి వేయాలి. ఆ తర్వాత కొంచెం నీటిని పోసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని .జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేసి ఒక గంట అలా వదిలేయాలి. .

గంటయ్యాక కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు సమస్య, చుండ్రు వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జుట్టుకు పోషకాలను అందించే ఆహారాలను కూడా తీసుకుంటూ ఉండాలి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

కలబందలో ఉన్న పోషకాలు చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించి జుట్టు రాలే సమస్య లేకుండా చేయడమే కాకుండా జుట్టు మృదువుగా మెరిసేలా చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. కరివేపాకులో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లు బలంగా ఉండి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.