Devotional

Lakshmi Devi: కొత్త సంవత్సరం పర్స్ లో ఈ వస్తువులను పెట్టుకుంటే.. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది

God Lakshmi Devi:ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటారు. అలాగే జీవితం సంతోషంగా గడవాలని కోరుకుంటారు.జ్యోతిష్య నిపుణుల ప్రకారం సంవత్సరం మొదటి రోజున నాలుగు వస్తువులను పర్స్ లో కానీ ఇంటిలో బీరువాలో కానీ పెడితే డబ్బుకు కొరత లేకుండా హ్యాపీగా జీవితాన్ని గడుపుతారు.

కొత్త సంవత్సరంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా సంవత్సరం పొడవునా హ్యాపీగా ఉండటానికి కొన్ని వస్తువులను పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోవాలి.

పుష్పించే చెట్టు ఆకు కొత్త సంవత్సరం మొదటి రోజున శుభ సమయంలో పర్స్ లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది.

కొత్త సంవత్సరం రోజున కొన్ని బియ్యం గింజలను పర్స్ లేదా బీరువాలో ఉంచడం వలన సంవత్సరం పొడవునా సంపదకు లోటు లేకుండా ఉంటుంది.

కొత్త సంవత్సరం మొదటి రోజున పర్స్ లేదా బీరువాలో గవ్వలను ఉంచుకోవాలి. గవ్వలు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాగే ఆ రోజున గోశాలలో గోవులను సేవించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుపుతుంది.

తామర గింజలను ఎర్రటి క్లాత్ లో కట్టి పర్స్ లేదా బీరువాలో ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం సంపూర్ణంగా అంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."