MoviesTollywood news in telugu

సూపర్ స్టార్ మహేష్ సినిమాల్లోకి వచ్చాక ఎన్ని ఆస్తులు సంపాదించాడో తెలుసా?

Mahesh Babu Net Worth:సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేబాబు తక్కువ కాలంలోనే స్టార్ డమ్ తెచ్చుకుని సూపర్ స్టార్ అయ్యాడు. రాజకుమారుడు మూవీతో హీరోగా ప్రవేశించి.. దేశంలోనే మోస్ట్ డిజైరబుల్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు.

ఫోర్డ్స్ మ్యాగజైన్ లో టాప్ డిజైర్ బుల్ మాన్ గా గుర్తింపు పొందిన మహేష్ బాబు సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్క హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఏకంగా 8నంది అవార్డులు గెల్చుకున్నాడు. తనకు వచ్చే రెమ్యునరేషన్ లో 20శాతం అనాధ ఆశ్రమాలకు అందిస్తాడు. హీల్ ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు,కేన్సర్ బాధితులకు ఉచిత ఆపరేషన్స్ చేయిస్తుంటాడు.

శ్రీమంతుడు సినిమాలో మాదిరిగా రెండు గ్రామాలను దత్తత తీసుకుని , సౌకర్యాలు కల్పిస్తున్నాడు. అయితే మహేష్ ఎంత సంపాదిస్తాడు,ఒక్కొక్క సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ ఎంత ,ఆస్తి విలువ గురించి ప్రస్తావిస్తే..మహేష్ బాబు మొత్తం ఆస్తులు 256 కోట్ల రూపాయలు. మహేష్ బాబు నటన, బ్రాండ్‌లను ప్రచారం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తాడు.

మహేష్ బాబుకు హైదరాబాద్‌లో పెద్ద బంగ్లా ఉంది. దీని విలువ 28 కోట్ల రూపాయలు. ఇటీవలే బెంగళూరులో ఇల్లు కొన్నారు. మహేష్ బాబుకు రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి కార్లను ఉన్నాయి.

హైదరాబాద్‌(Hyderabad)లోని ఏషియన్ సినిమాస్‌లో మహేష్ బాబు భాగస్వామి. ఇది 2021లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని విలాసవంతమైన థియేటర్లలో ఇది కూడా ఒకటి. మహేష్ బాబుకు సొంతంగా రెస్టారెంట్ కూడా ఉంది. ప్రస్తుతం మహేశ్ బాబు.. గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."