MoviesTollywood news in telugu

కృష్ణ గారడి సినిమాలో విగ్గు రహస్యం…ఒక్క సీన్ కోసం ఎన్ని రోజులు..?

Super Star krishnagaaradi movie : డైరెక్టర్ విజయబాపినీడు, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో తొలిసారి వచ్చిన మూవీ కృష్ణగారడి. పైగా కృష్ణ తండ్రీ కొడుకులుగా డబుల్ రోల్ చేసాడు. విచిత్రం ఏమిటంటే ఇందులో హీరో పేరు కూడా కృష్ణ. చిన్నపొరపాటు కారణంగా ఒక్క సీన్ తీయడానికి నెలరోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి గురించి వస్తుంది.కృష్ణను విలన్ బహదూర్ నాగరాజు చంపినందుకు తన భర్తను పోలీసులకు పట్టించి, తన కొడుకుతో పాటు బహదూర్ కొడుకుని కూడా పెంచి పెద్ద చేస్తుంది బహదూర్ భార్యగా నటించిన షావుకారు జానకి. విలన్ గురించి ఓ రహస్యం తెలుసుకోడానికి హీరో మారు వేషంలో అతడి స్థావరానికి వెళ్తాడు.

విలన్ ఎంత తెలివైనవాడు అయినా, హీరో మారువేషంలో వస్తే అస్సలు గుర్తుపట్టనంత గమ్మత్తుగా మారువేషాలు ఆరోజుల్లో ఉండేవి. కేవలం విగ్గు మార్చుకుని మారువేషంలో విలన్ దగ్గరకు వెళ్లి ఆడిపాడిన అనంతరం విగ్గు తీసేస్తాడు హీరో కృష్ణ.

ఏవిఎం స్టూడియోలో ఈ సీన్ చిత్రీకరించారు. కృష్ణ, జగ్గయ్య, సత్యనారాయణ, రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ తదితరులు ఈ సీన్ షూటింగ్ లో నటించారు.
సాయంత్రం 5గంటలకల్లా వెళ్లిపోతానని డైరెక్టర్ దగ్గర కృష్ణ ముందుగానే అనుమతి పొందారట. అయితే ఆరోజు విగ్గుతో షూటింగ్ ఉండదని భావించి మేకప్ మ్యాన్ మాధవరావు విగ్గుతో బయటకు వెళ్లిపోయారట. అతడి కోసం గాలించాడు.

అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కనుక మర్నాటికి ఈ సీన్ వాయిదా వేయాలని కృష్ణ చెప్పేసి వెళ్లిపోయారట. అయితే ఆ సీన్ కోసం వేసిన సెట్ తీసేసి కొత్తగా తమిళ మూవీ కోసం ఆ రాత్రి సెట్ వేస్తారన్న విషయం డైరెక్టర్, నిర్మాతలకు గుర్తొచ్చింది. కానీ విగ్గులేదు. మిగిలిన ఆర్టిస్టులు బిజీ. దీంతో ఆ విగ్గు సీన్ తీయడానికి నెలరోజులు పట్టిందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."