Beauty Tips

చలికాలంలో ఏ సబ్బు వాడితే మంచిదంటే..

మామూలు సమయాల్లో కంటే చలికాలంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైమ్‌లోనే స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాంటప్పుడు ఎలాంటి సబ్బులు, వాడాలి.. ఏయే టిప్స్ పాటిస్తే అందంగా మెరిసిపోతారో తెలుసుకోండి..

లోషన్స్
లోషన్స్.. కొంతమంది చలికాలంలో లోషన్స్ వాడరు.. దీనికి వారు చెప్పే కారణం ఎండ అంతగా ఉండదు. మరి ఇంకెందుకు లోషన్స్ అని అంటారు. కానీ, ఈ సమయంలోనూ లోషన్స్ ఎక్కువగా వాడాలి. బయటకు వెళ్లేటప్పుడు ముఖం తాజాగా ఉండేందుకు, ట్యాన్ దూరం చేసుకునేందుకు పూల రసాలతో తయారైన లోషన్స్ వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

ఎందుకంటే ఈ సమయంలోనూ సూర్య కిరణాల ప్రభావం ఉంటుంది. ఫ్లవర్ బేస్డ్ లోషన్స్, ఇందులోనూ గులాబీ, మల్లె, మందారం లాంటి వాటితో తయారైన లోషన్స్‌ని వాడండి.. వీటితో పాటు.. కచ్చితంగా సన్‌స్క్రీన్ లోషన్స్ వాడాలి.

సబ్బుల వాడకంలో జాగ్రత్తలు
ఈ టైమ్‌లో చర్మానికి ఎక్కువ పోషణ అవసరం. అందుకే గ్లిజరిన్, రోజ్ వాటర్‌ని వాడడం మంచిది. వీటితో తయారైన సబ్బులు, ఫేస్ వాష్‌లు వాడడం మంచిది. దీని వల్ల చర్మానికి మంచి పోషణ అందుతుంది. కాంతులీనుతుంది. వారానికి ఓ సారి సున్నిపిండిని వాడడం మంచిది.. వీటితో పాటు బేబీ సోప్ వాడినా చక్కని ఫలితం ఉంటుంది. ఆ విధంగా ట్రై చేయండి..

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.