Beauty Tips

Crackes Heels:చలి కాలంలోనూ పాదాలు పగుళ్లు లేకుండా అందంగా ఉండాలంటే ఇలా చేయండి..

వింటర్‌ వచ్చిందంటే చాలు చర్మ సంరక్షణ అనేది కాస్తా కష్టంగానే మారుతుంది. ఇక సమయంలోనే కాలిపగుళ్లు, పాదాలు అందవిహీనంగా మారడం జరుగుతుంది. ఈ సమస్యను కొన్ని ఇంటి చిట్కాలతో సరి చేసుకోవచ్చు. అవేంటంటే..కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా కాలి పగుళ్లు, చారికలు ఏర్పడతాయి.

మరికొంతమందికి చలికాలం వచ్చిందంటే సమస్య ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏయే టిప్స్ వాడాలో తెలుసుకుందాం.. కాలి పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే వీటి నుంచి రక్తస్రావం అయ్యి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది.

రోజూ స్నానం చేసే సమయంలో పాదాలను ప్యూమిన్ స్టోన్‌తో రాయాలి. అనంతరం కొబ్బరి నూనె రాయాలి. ఇలా చేయడం వల్ల పగుళ్ల సమస్య త్వరగా దూరం అవుతుంది.

వారానికి ఓ సారి కాళ్లని ఇంట్లోనే పెడిక్యూర్‌ చేయాలి. ఇందుకోసం ఓ టబ్‌లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇందులో ముందుగా ఏదైనా లిక్విడ్ సోప్, డెటాల్, షాంపూని కానీ వేయాలి.. ఇందులో కాళ్లని ఓ పది నిమిషాలు ఉంచి మెత్తటి బ్రష్‌తో క్లీన్ చేసుకోవాలి..

గోర్లని బాగా శుభ్రం చేయాలి. ఒక వేళ కాళ్లు బాగా మురికి పట్టి ఉన్నాయంటే స్క్రబ్ చేసుకోవచ్చు. అందుకోసం కాసింత తేనెలో చక్కెర కాసింత కాఫీ పొడి, రెండు చుక్కల నిమ్మరసం కలిపి మెల్లిగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత కాళ్లని కడగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."