MoviesTollywood news in telugu

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే మిస్ కాకుండా చూడండి

గ్లామర్ ,అభినయం కలగలిసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్,ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా హీరోయిన్ రేంజ్ ని మించి పోయిన నటి అనగానే రమ్యకృష్ణ గుర్తొస్తుంది. ఎందుకంటే శివగామి పాత్రతో బాహుబలి మూవీ లో ఆమె చేసిన నటన వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చింది. ఇక ప్రస్తుతం రమ్యకృష్ణ రంగమార్తాండ తో పాటు తమిళంలో పలు సినిమాలు చేస్తోంది.

సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ నిజానికి ఒకప్పుడు హీరోయిన్ గా తన గ్లామర్ తో సినిలోకాన్ని ఒక ఊపు ఊపేసింది. దాదాపుగా సౌత్ ఇండియన్ హీరోలు అందరితోనూ చేసి, హిట్స్ అందుకుంది. హీరోయిన్ గా చేసినంత కాలం రమ్యకృష్ణ ఫాన్స్ ఆమెను ఎంతగానో ఆరాధించేవారు. అంతగా పాపులారిటీ తెచ్చుకుంది.

అందమైన హావభావాలతో అద్భుతమైన నటనతో సినీ అభిమానులను అలరిస్తూ వచ్చిన రమ్య ఇప్పటికి అందం ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకుల ను మెస్మరైజ్ చేస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనే మూవీ అందుకు నిదర్శనం ఇక గత సినిమాల్లో అయితే ఆమె అందం ఇప్పటికీ ఫాన్స్ కళ్లముందు మెదులుతూనే ఉంటుంది.

అయితే ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. రమ్యకృష్ణకు సెకండ్ లైఫ్ ఇచ్చిన సినిమా బాహుబలి సినిమాలోని శివగామి పాత్రనే చెప్పాలి. ఒకవిధంగా చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నంతగా ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్.

అయితే బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ రేంజ్ పేరు మాత్రం దక్కలేదు. రమ్యకృష్ణ తెలుగే కాదు సౌత్ బాషలన్నింటికీ సుపరిచితురాలే. ఇక అందరిలా కాకుండా సోషల్ మీడియాలో అరుదుగా కనిపించే రమ్యకృష్ణ ఇటీవలే తన చిన్ననాటి తన క్లాసుమేట్స్ తో గల ఫోటో ఒకటి పోస్ట్ చేసింది.

ప్రైమరీ స్కూల్ లెవెల్లో దిగిన ఫోటో లా ఉంది అది. అందుకేనేమో ఆ ఫోటో షేర్ చేసి తనను గుర్తు పట్టండి అని కాప్షన్ కూడా పెట్టింది. ఫాన్స్, నెటిజన్లు ఇక తమ ప్రతాపం చూపిస్తూ,.. అదిగో ఇదిగో అంటూ కామెంట్స్ చేశారు. ఆఖరికి రమ్యకృష్ణనే ఇదిగో అంటూ మార్క్ చేసి చూపించింది. ఇక ఆ ఫోటోలో రమ్యకృష్ణ రెండు పిలకలు వేసుకొని.. కళ్లద్దాలు పెట్టుకొని నిలబడింది. ఈ పిక్ ఫాన్స్ ని మురిపిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."