MoviesTollywood news in telugu

తండ్రి సెంటిమెంట్ తో కొడుక్కి గుణపాఠం చెప్పిన మూవీ…ఎంత లాభం వచ్చిందో తెలిస్తే షాక్

బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అయినా,కంటికి రెప్పలా కాపాడేది తండ్రి. అందుకే తల్లిదండ్రులిద్దరూ సమానమే. కానీ ఎక్కువ సినిమాలు తల్లి సెంటిమెంట్ తో వస్తే, కొన్ని సినిమాలు తండ్రి సెంటిమెంట్ తో వచ్చాయి. అలా వచ్చిన సినిమాల్లో పెద్దపీట వేయాల్సిన సినిమా గురించి చెప్పాలంటే,సూరిగాడు మూవీ గురించే చెప్పాలి.

దర్శకరత్న దాసరి నారాయణరావు నటించి దర్శకత్వం వహించిన ఈసినిమా ను 1982లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డి రామానాయుడు నిర్మించారు. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో మంచి సెంటిమెంట్ జోడించి తీసిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాతోనే తన స్టాఫ్ కి ఓ నెల జీతం బోనస్ గా ఇచ్చారట రామానాయుడు.

ఆఫీసర్స్ క్లబ్ లో ప్యూన్ గా చేసే సూరిగాడు పాత్రలో దాసరి ఒదిగిపోయాడు. దర్శకునిగా కన్నా,నటుడిగా దాసరి విశ్వరూపం ప్రదర్శించాడు. ఇతని భార్య పాత్రలో సుజాత కూడా అదరగొట్టేసింది. కొడుకు బాగా చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలని బాగా చదివిస్తాడు. కొడుకుగా సురేష్ నటించాడు. నాన్న పేరు చెప్పుకోడానికి సిగ్గుపడుతూ ,డబ్బున్నవాడిగా బిల్డప్ ఇచ్చుకుంటూ డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. పేరెంట్స్ ని కూడా పిలవకుండా పెళ్లి చేసుకుంటాడు.

ఇక అనుకోని పరిస్థితిలో అదే ఇంటికి పనిమనిషిగా తల్లి,వాచ్ మాన్ గా తండ్రి చేరతారు. ఈక్రమంలో తల్లికి జబ్బు చేయడంతో ఆమెను బతికించుకోడానికి నాలుగు లక్షలు అవసరం కావడంతో సూరిగాడు కోర్టుకి వెళ్లి,కొడుకుకోసం ఖర్చు పెట్టిన డబ్బుని ఇప్పించాలని వాదించి రాబట్టుకుంటాడు. అలా ఇంటినుంచి బయటపడతాడు. కొడుకు విదేశాలకు వెళ్ళిపోతాడు.

ఎన్నో కుటుంబాల్లో కనువిప్పు కల్గించిన ఈ మూవీ లో కోడలిగా యమున, వియ్యంకునిగా గొల్లపూడి మారుతీరావు,ఇలా అందరి నటన ఆకట్టుకుంది. ఆడియన్స్ ని కంటతడి పెట్టించింది. క్లాస్ మాస్ అనేతేడా లేకుండా అందరినీ థియేటర్ల వైపు నడిపించిన సూరిగాడు ఎప్పటికీ ఎవర్ గ్రీనే.