Kitchenvantalu

Watermelon Halwa:పుచ్చకాయ తొక్కలను పాడేయకండి.. ఇలా హల్వా చేస్తే చాలా రుచిగా ఉంటుంది..

Watermelon Halwa:వాటర్ మిలన్ హల్వా..పుచ్చకాయ అనగానే ఎరుపు భాగాన్ని తినేసి తెల్లటి భాగాన్ని పారేస్తుంటాం.నిజానికి అదెంతో బలం.లోపటి తెల్లని పదార్ధంతో హల్వా చేస్తే అదిరి పోతుంది.

కావాల్సిన పదార్ధాలు
వాటర్ మిలన్ – 1 కప్పు
మిల్క్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్స్
చక్కెర – 1 కప్పు
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
డ్రై ఫ్రూట్స్ – 3 టేబుల్ స్పూన్స్
యాలకుల పొడి – ½ టీ స్పూన్స్

తయారీ విధానం
1.ముందుగా వాటర్ మిలన్ లోని తెల్లటి పదార్ధాన్ని వేరు చేసి తురమి పక్కన పెట్టుకోవాలి.
2.ఇప్పుడు ప్యాన్ లో నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ ని వేపి పక్కన పెట్టుకోవాలి.
3.అదే ప్యాన్ లోకి మరి కాస్త నెయ్యి వేసి వాటర్ మిలన్ తురుము వేసి పది ,పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
4.ఇప్పుడు చక్కెరను యాడ్ చేసి మిల్క్ పౌడ్ ని కూడ వేసుకోని కరిగించాలి.
5.చక్కెర హల్వాను కలుపుతూ ఉండాలి.
6.కాస్తా దగ్గర పడ్డాక యాలకుల పొడి ,వేయించిపెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వాటర్ మిలన్ హల్వా రెడీ.