MoviesTollywood news in telugu

Brahmamudi Rahul: బ్రహ్మముడి రాహుల్ లైఫ్ లో ఇంత బాధ ఉందా!

Brahmamudi Serial Rahul:బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ గా  నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రాహుల్ అసలు పేరు శ్రీకర్ కృష్ణ. బ్రహ్మముడి సీరియల్ లో పైకి  ప్లే బాయ్ గా  కనిపించి లోపల మాత్రం పెద్ద విలన్ గా ఉండే పాత్రను రాహుల్ చాలా సులభంగా చేసేస్తున్నాడు.

ఈ బ్రహ్మముడి సీరియల్ లో రాహుల్ 3 వేరియేషన్లు ఉన్న క్యారెక్టర్ ను పోషిస్తున్నాడు. ఇంటిలో అమాయక చక్రవర్తిగా కనిపిస్తాడు.వైజాగ్ లో పుట్టి పెరిగిన శ్రీకర్ మొదటగా మెజీషియన్ గా చిన్ని చిన్ని స్టేజ్ షోలు ఇచ్చేవాడు. ఆ తర్వాత సైరా సినిమాలో చిన్న పాత్రను పోషించాడు.

ఆ తర్వాత హీరోగా సిరిమల్లె పువ్వా అని సినిమా చేశాడు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చాడు.శ్రీకర్ నాన్న లెక్చరర్. అమ్మ తెలుగు పండిట్ టీచర్. శ్రీకర్ నటుడుగా పేరు తెచ్చుకోవడం అనేది శ్రీకర్ అమ్మ కల. 

అమ్మ కల నెరవేర్చి ఒక స్థాయిలో నిలబడ్డాడు. ప్రస్తుతం శ్రీకర్ శతమానం భవతి సీరియల్ లో హీరో కార్తీక్ పాత్ర చేస్తున్నాడు. ఇక బ్రహ్మముడి సీరియల్ లో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. శ్రీకర్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొన్నాడు. ఇలా మంచి పాత్రలను చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుందాం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."