MoviesTollywood news in telugu

Brahmamudi serial:బ్రహ్మముడి రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ గురించి ఈ విషయాలు తెలుసా..?

Brahmamudi telugu serial Sharmitha Gowda:బ్రహ్మముడి సీరియల్‌‌ ప్రారంభం అయ్యి ఎంతో సక్సెస్ గా ముందుకు కొనసాగుతూ ప్రేక్షక ఆదరణ పొందింది. ఈ సీరియల్ లో నటించిన నటీనటులకు మంచి పేరు వచ్చింది. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

ఈ సీరియల్‌లో మానస్‌కి అత్త పాత్రలో రుద్రాణి.. అద్భుత నటనను ప్రదర్శిస్తోంది. ఈమె అసలు పేరు షర్మితా గౌడ. అత్త పాత్రలో స్టైలిష్​గా కనిపించే ఈ భామ.. బయట కూడా ఫుల్ ట్రెండీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ ఫుల్​ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

కన్నడ నటి అయినా షర్మితా బ్రహ్మముడి సీరియల్ లో నెగిటివ్ రోల్ లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. మొదట కన్నడ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత తమిళ సీరియల్స్ లో నటించి…ఇక ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.

ప్రస్తుతం కన్నడ,తమిళ,తెలుగు సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ చేస్తూ చాలా బిజీగా ఉంది. షర్మిత గౌడను తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. ఆమె కూడా తనదైన నటనతో ముందుకు దూసుకుపోతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."