Guppedantha Manasu:గుప్పెడంత మనసు శైలేంద్ర భూషన్ గురించి ఈ విషయాలు తెలుసా?
Guppedanta Manasu Suresh Babu:గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షక ఆదరణతో చాలా సక్సెస్ గా ముందుకు సాగుతోంది. ఈ సీరియల్ లో విలన్ గా శైలేంద్ర భూషన్ తనదైన శైలిలో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. చాలా అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
శైలేంద్ర భూషన్ పాత్రలో సురేష్ బాబు నటిస్తున్నాడు. సురేష్ బాబు సీరియల్ అభిమానులకు సుపరిచమే. గుంటూరు కి చెందిన సురేష్ బాబు చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి అయ్యాక ముత్యాలముగ్గు సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సీరియల్ మంచి పేరు తెచ్చి పెట్టడంతో వరుస అవకాశాలతో ఆడదే ఆధారం, సూర్యవంశం, సిరిసిరిమువ్వలు, నువ్వా నేనా, శ్రీనివాస కళ్యాణం, రాజారాణి, శ్రీమంతుడు వంటి సీరియల్స్ చేశాడు.
అలాగే చిన్నదానా నీకోసం, సరైనోడు వంటి సినిమాల్లో కూడా నటించాడు. గుప్పెడంత మనసు సీరియల్లో దేవయాని కొడుకుగా శైలేంద్ర భూషన్ విలన్ గా అద్భుతంగా నటిస్తున్నాడు. అన్నదమ్ముల మధ్య పోరుతో ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది.
ఈ మధ్యకాలంలో తెలుగు సీరియల్స్ లో ఆడవారే విలన్సుగా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు మగ విలన్ గా కనిపించే శైలేంద్ర భూషన్ పాత్రలో సురేష్ బాబు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.