Diabetes habits:షుగర్ వచ్చే అలవాట్లు ఇవే…. మీకు ఉన్నాయేమో….ఒక్కసారి చెక్
Diabetes habits :మారిన ఆహార, వ్యవహారాలతో షుగర్ మహమ్మారి ప్రతి ఒక్కరినీ కబళిస్తోంది. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఇప్పుడు అంతా ఈ వ్యాధికి దగ్గరవుతున్నారు. అయితే మనకు ఉన్న కొన్ని అలవాట్లు షుగర్ వచ్చే ప్రమాదాన్ని మరింత తీవ్రం చేస్తాయని తాజాగా పరిశోధనలు తేల్చాయి.
బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను అమాంతం పెంచే ఈ ఆహార పదార్థాలు, అలవాట్లకు దూరంగా లేకుంటే మీ జీవితాన్ని చక్కెర వ్యాధికి అప్పగించినట్లేనని హెచ్చరిస్తున్నారు.
సరదా కోసమో, టైంపాస్ కోసమో సేవించే కూల్ డ్రింక్స్, సాప్ట్ డ్రింక్స్ లో యాడెడ్ షుగర్ కంటెంట్ చాలా మోతాదులో ఉంటుంది. సో తరచుగా తాగేవారికి డయాబెటిస్ పొంచి ఉన్నట్టే.
* కెఫీన్ అనే డ్రగ్ ఉండే కాఫీని ఎక్కువగా తాగేవారికి మధుమేహం మెల్లిగా శరీరంలోకి చేరుతుంది.
* డ్రై ఫూట్స్ రోజూ తింటే చాలా మంచిది. కాని మోతాదు మించి తిన్నా కూడా ప్రమాదమేనట. ఎక్కువ మోతాదులో డ్రై ఫ్రూట్స్ శరీరంలోకి చేరితే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.
* పిజ్జా, ప్రై వంటకాలు, జర్గర్లు, చాక్లెట్లలో యాడెడ్ షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితోని షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయి.
* అమ్మాయిలు గర్భనిరోధానికి కండోమ్ కి బదులుగా మాత్రలను వినియోగిస్తూ కూడా ముప్పే. వాటి వల్ల కూడా షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.
* కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడినా, దీర్ఘకాలం వాడుతున్నా మదుమేహం దాడిచేసే ప్రమాదం ఉంది.
* చివరిగా మీరు స్వీట్ ప్రియులైతే కూడా మీ శరీరాన్ని మీరే షుగర్ కు అప్పగిస్తునట్టేనట. సో బీ కేర్ ఫుల్..