MoviesTollywood news in telugu

Tollywood:’పిల్ల నచ్చింది’ సినిమాను రిజెక్ట్ చేసిన నలుగురు స్టార్ హీరోలు…ఎవరో..?

Pilla Nachindi Full Movie : హీరోని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తూంటారు. తీరా ఆ హీరో రిజెక్ట్ చేస్తే, మరో హీరోకి తగ్గట్టు తీయవచ్చని భావిస్తారు. అయితే ఏకంగా నలుగురు అగ్ర హీరోలు వద్దనుకున్న సినిమాను హీరో శ్రీకాంత్ చేసాడు. పైగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమా కావడం విశేషం.

ఎన్నో హాస్య రస చిత్రాలు తీసి, కమర్షియల్ మూవీస్ కూడా తీసిన స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చేసిన సినిమా ఇది.ఈవీవీ 1999లో పిల్ల నచ్చింది మూవీ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా కథ చిరంజీవి,బాలయ్య,నాగార్జున,వెంకటేష్ లకు వివరిస్తే, వాళ్ళు రిజెక్ట్ చేయడంతో శ్రీకాంత్ దగ్గరకు వెళ్ళింది. శ్రీకాంత్ ఒకే చేసాడు.

రచన, సంఘవి హీరోయిన్స్ గా చేసారు. అయితే టైటిల్స్ కార్డ్స్ ఫన్నీగా పరిచయం చేసాడు. ఇక పిల్ల నచ్చింది సినిమా హాస్యం మేళవించి రూపొందించడంతో ఆకట్టుకుంది. తన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లను హీరోలుగా ఎంట్రీ ఇప్పించిన ఈవీవీ చిన్న వయస్సులోనే ఈలోకం నుంచి నిష్క్రమించడం విచారకరం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."