Tollywood Heroines:ఈ హీరోయిన్స్ ఏ వయస్సులో పెళ్లి చేసుకున్నారో తెలుసా ?
Tollywood Heroines:పెళ్ళికి అప్పుడే తొందర లేదని నాలుగు పదుల వయస్సు వస్తున్నా కొందరు తారలు చెప్పేమాట. ఇంకా పెళ్ళికి తొందరేమిటి అనే మాటా వినిపిస్తుంది. అయితే కొందరు తారలు సరైన సమయంలో పెళ్ళిచేసుకుని ఎంచక్కా లైఫ్ ని ఎంజాయ్ చేసి,సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.
అయితే ఇప్పటివరకూ పెళ్లిచేసుకున్న తారలను పరిశీలిస్తే వాళ్ళ పెళ్లినాటికి వయస్సు తెలిస్తే వావ్ అంటాం. అవును ఒకసారి తెలుసుకుందాం. అందం అభినయంతో సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా అదరగొట్టిన రోజా పెళ్లి చేసుకునే సమయానికి ఆమె వయస్సు 30ఏళ్ళు. నటి మీరా జాస్మిన్ 32ఎల్లా వయస్సులో పెళ్లాడింది.
కానీ హీరోయిన్ రక్షిత 23ఏళ్లకే పెళ్లిపీటలెక్కింది. రాధికా పండిట్ 32ఏళ్ళ ప్రాయంలో పెళ్లిచేసుకుంది. ఇక సంఘవి వయస్సు చూస్తే ఏకంగా 39ఏళ్లకు పెళ్ళిచేసుకుని సెటిల్ అయింది. అందాల తార స్నేహ 31ఏళ్లకే తగిన వరుడిని వెతుక్కుని పెళ్లాడింది.
రంభ 32సంవత్సరాల వయస్సులో పెళ్లిచేసుకోగా,ప్రియమణి 33ఏళ్ళ వయస్సులో,అనన్య 25ఏళ్లకు పెళ్లిచేసుకున్నారు. సమీరా రెడ్డి 34ఏళ్లకు,నమిత 36ఏళ్లకు,ఆసిన్ అలాగే సంగీత 31ఏళ్లకు పెళ్లిపీటలు ఎక్కారు.
కేరళ కుట్టి మమతా మోహన్ దాస్ 26ఏళ్లకే పెళ్లాడింది. రాధిక 22ఏళ్ళ వయస్సులో మొదటి పెళ్లి చేసుకుని,27ఏళ్లకు రెండో పెళ్లి చేసుకుంది. ఇక 38ఏళ్ళ వయస్సులో ముచ్చటగా మూడో పెళ్లి ,నటుడు శరత్ కుమార్ తో జరిగింది.
రీమాసేన్ 31ఏళ్లకు,మీనా 33ఏళ్లకు,సంధ్య 27సంవత్సరాల వయస్సులో పెళ్లిచేసుకున్నారు. శ్రీయ శరన్ 35ఏళ్ళ వయస్సులో పెళ్లి చేసుకుంటే, జెనీలియా 25ఏళ్లకే పెళ్లాడింది. ఇక శరణ్య మోహన్ 26సంవత్సరాలకు,సోనియా అగర్వాల్ 24ఏళ్లకు పెళ్లిచేసుకున్నారు.