Kitchenvantalu

Vangi Bath Curry:కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా వాంగీబాత్ మసాలా కర్రీ ఇలా ట్రై చేసి రుచి చూడండి

Vangi Bath Curry:వంగి అంటే వంకాయ (వంకాయ) మరియు భాత్ అంటే బియ్యం. ఎక్కువగా డ్రై డిష్‌గా చూస్తారు, ఇది మోసారు బజ్జీ లేదా రైతాతో కలిసి ఉంటుంది. కొబ్బరి మరియు కొత్తిమీర కొన్ని తేలికపాటి మసాలా దినుసులతో బాగా కలిపిన రుచి. సాంప్రదాయకంగా, ఈ వంటకం చిన్న, ఆకుపచ్చ వంకాయలను ఉపయోగించి తయారు చేయబడుతుంది.

కావాల్సిన పదార్ధాలు:
తెల్ల వంకాయలు: పావుకిలో
పసుపు
కరివేపాకు
ఉప్పు: తగినంత
నూనె: రెండు టేబుల్‌ స్పూన్లు
50 ml చింతపండు పులుసు

మసాలా కి కావాల్సిన పదార్ధాలు:
ఎండుమిర్చి 6-7
శనగపప్పు 1tsp
మినప పప్పు 1 tsp
ఎండుకొబ్బరి తురుము
ధనియాలు
దాల్చిన చెక్క- 1 inch
లవంగాలు 3-4
బెల్లం – 1 tsp
నెయ్యి 1 tsp

వంగీ బాత్ curry తయారీ విధానం:
ముందుగా వంకాయలను ముక్కలుగా కోసి ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో వేసుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నెయ్యి వేసి అందులో మినపప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించి ఎండుమిర్చి ,ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, బెల్లం వేసి దోరగా వేయించి మిక్సీ లో వేసి మెత్తని పొడి చేసుకోండి.

తర్వాత స్టవ్‌మీద పాన్‌ పెట్టి ఒక టీస్పూన్‌ నూనెవేసి అందులో కరివేపాకు,వంకాయ ముక్కలు, పసుపు వేసి బాగా కలిపి మగ్గనివ్వండి. వంకాయలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు, ఉప్పు వేసిన తర్వాత మగ్గించుకోండి. ముక్కులు పులుసును పీల్చుకున్నాక పొడి వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోండి. నెయ్యి చల్లుకుంటే ఘుమఘుమలాడే వంగీ బాత్‌ curry రెడీ.