Healthhealth tips in telugu

Dust allergy:డస్ట్ ఎలర్జీ తో బాధపడుతున్నారా… వీటిని ఫాలో అయితే సరి

Home remedies for dust allergy in telugu:ఈ రోజుల్లో డస్ట్ ఎలర్జీ అనేది చాలా ఎక్కువగా బాధిస్తోంది. ఏ కాస్త దుమ్ము, ధూళి తగిలిన ఎలర్జీ వచ్చేస్తుంది. ఎలర్జీ అంటే దగ్గు., తుమ్ములు, ఊపిరి సరిగా ఆడక పోవడం వంటి సమస్యలు వస్తాయి. ఎలర్జీ ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మందులు అవసరం లేకుండా డస్ట్ ఎలర్జీ తగ్గించుకోవటానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

డస్ట్ ఎలర్జీ తగ్గించడానికి ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా .పనిచేస్తాయి. ఎలర్జీ ఉన్నవారు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగితే మంచి ఫలితం కనబడుతుంది.

పసుపు కూడా డస్ట్ ఎలర్జీ ని తగ్గిస్తుంది. ఒక గ్లాసు నీటిలో 2 చిటికెల పసుపు వేసి బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక తాగాలి.

నీటిని ఎక్కువగా తాగుతూ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవాలి. అప్పుడు ఎలర్జీలు ఏమి రావు.

విటమిన్ సి., యాంటీఇన్ఫ్లమేటరీ,యాంటీ ఇన్ఫర్మేషన్ లక్షణాలు ఉన్న కమలాపండు, జామ, బొప్పాయి,కివి, యాపిల్ వంటి వాటిని తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.