Sprouts Poha:బ్యాచిలర్స్ స్పెషల్ మొలకల అటుకుల ఉప్మా…చాలా సులభంగా చేసుకోవచ్చు
Sprouts Poha:మొలకల అటుకులు, కూరగాయలతో కలిపి ఇప్పుడు చెప్పే ఉప్మా ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మన శరీరానికి అందిస్తుంది. ముఖ్యంగా డైట్ లో ఉన్నవారికి, బ్యాచిలర్స్ కి ఈ ఉప్మా చాలా సులువుగా తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోయే ఆరోగ్యకరమైన టిఫిన్ కోరుకునే వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు
కావలసిన పదార్ధాలు
ఒకటిన్నర కప్పుల అటుకులు,3 tbps నూనె, 3 tbsp వేరుశెనగ గుళ్ళు, 1 tsp ఆవాలు, 1 tsp జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, 1/4 cup ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి (సన్నని తరుగు), 1/4 cup కేరట్ (చిన్న చిన్న ముక్కలు), 1/4 cup కాప్సికం తరుగు, 1/4 cup టమాటో సన్నని తరుగు, ఉప్పు – రుచికి సరిపడా, 1/4 tsp పసుపు, 1/4 cup బటాణీ (పచ్చి బఠానీ నానబెట్టినవి), 1/2 cup మొలకలు, 1/4 tsp పంచదార, 4 tbsp నీళ్లు, కొత్తిమీర – కొద్దిగా, 1 tbsp నిమ్మరసం,
తయారి విధానం
అటుకులను జల్లించి ఒక బౌల్లో వేసి దానిలో నీటిని పోసి మూత పెట్టాలి. ఇలా నీటిని పోయటం వలన అటుకులు నాని మెత్తగా తయారవుతాయి. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి వేరుసెనగ గుళ్ళు వేసి కొంచెం వేగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేగించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేసి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి.
ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు, బఠానీ, మొలకలు, టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి మూడు నిమిషాల పాటు మగ్గించాలి. ఆ తర్వాత అటుకులు వేసి అటుకులు విరగకుండా జాగ్రత్తగా బాగా కలపాలి. ఆ తర్వాత పంచదార వేసి మూకుడు కదపకుండా అంచుల వెంట కొంచెం నీటిని పోసి మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఆవిరి మీద ఉడికిస్తే అటుకులు సరిగ్గా లోపల వరకు మగ్గుతుంది. ఆ తర్వాత మూత తీసి కొంచెం నిమ్మరసం, కొంచెం కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఎంతో రుచికరమైన Sprouts Poha రెడీ.

