Healthhealth tips in telugu

Eating Breakfast After Bath: ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్నానం చేస్తున్నారా…రిస్క్ లో పడినట్టే

Eating Breakfast After Bath :ప్రతిరోజు ఉదయం కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు అయితే పోషకాహార నిపుణులు మాత్రం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పిల్లలైనా పెద్దలైనా ఉదయం బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి.

అయితే మారిన జీవన శైలి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ టిఫిన్ విషయంలో ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. నిద్ర లేవగానే బ్రష్ చేసుకుని టిఫిన్ చేసేస్తూ ఉంటారు ఆ తర్వాత స్నానం చేసి ఆఫీస్ లేదా స్కూల్ కి వెళ్తూ ఉంటారు. మనలో చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత స్నానం చేయకూడదు.

ఎందుకంటే అలా స్నానం చేయడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గి ఆ ప్రభావం జీర్ణ వ్యవస్థ మీద పడి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి కాస్త ఓపిక చేసుకుని స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేయండి. స్నానం చేసిన తర్వాత టిఫిన్ చేస్తే తీసుకున్న టిఫిన్ బాగా జీర్ణం అయ్యి మెదడు చురుగ్గా పని చేసి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఆయిల్ ఫుడ్స్ కాకుండా తీసుకుంటే మంచిది. ఆయిల్ ఫుడ్స్ వారంలో ఒకటి రెండుసార్లు తీసుకోవచ్చు. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."