Healthhealth tips in telugu

Weight Loss:గులాబీ రేకులు తింటే బరువు తగ్గుతారు… దీనిలో నిజమెంత..?

Rose petals tea for weight loss in telugu :అందమైన గులాబీ పూలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గులాబీ పూలను దేవుని అలంకరణ కు, చర్మసౌందర్యానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఆరోగ్యానికి చాలా మంచిదని గులాబీ రేకులను తింటూ ఉంటారు. గులాబీ రేకులను తినటం వలన బరువు తగ్గుతారని చాలామంది తింటూ ఉంటారు.

గులాబీ రేకులను తింటే బరువు తగ్గుతారు. అధిక బరువు సమస్య ఉన్నవారికి గులాబీ రేకులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే గులాబీ రేకులను కొంచెం క్రష్ చేసి నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తేనె కలుపుకొని తాగాలి.ఈ విధంగా ప్రతి రోజు తాగుతుంటే కొవ్వు కరుగుతుంది.

అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. శరీరం నుండి హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగిస్తుంది. అంతేకాక చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. అంతేకాక కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది.

అంతేకాకుండా తలనొప్పి, ఒత్తిడి, రక్తహీనత వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.రాత్రి సమయంలో తాగితే ఒత్తిడి లేకుండా మంచి నిద్ర పడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.