Beauty TipsHealth

Hair Care Tips;వీటిని నానబెట్టి జుట్టుకి పట్టిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Kalonji Hair Fall Tips In Telugu: ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన జుట్టు రాలటం,తెల్ల జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అలా కాకుండా ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు. దీని కోసం రాత్రి సమయంలో ఒక బౌల్ లో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కలోంజీ సీడ్స్ వేసి నీటిని పోసి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చాలా తక్కువ సమయంలోనే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. కలోంజీ సీడ్స్ లో థైమోక్వినోన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటిహిస్టామైన్. ఇది జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది.

అలాగే ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మెంతులు జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తాయి. ఇందు వల్ల జుట్టు సాఫ్ట్ గా షైనీ గా ఉంటుంది. అలాగే చుండ్రు సమస్య లేకుండా ఉండటానికి జుట్టును తేమగా ఉంచుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."