Healthhealth tips in telugu

Headache: తలనొప్పులలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా…మిమ్మల్ని వేదించే తలనొప్పి ఏ రకమో తెలుసుకోండి

Headache:ప్రపంచంలో ఎక్కువగా వేదించే సమస్యల్లో తలనొప్పి ఒకటి. తలనొప్పి అనేది ప్రతి ఒక్కరిని ఎప్పుడో ఒక అప్పుడు వేధిస్తూనే ఉంటుంది. తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వస్తుంది. తలనొప్పులు అనేవి 8 రకాలు ఉన్నాయని నిపుణులు చెప్పుతున్నారు. ఇప్పుడు ఆ 8 రకాల తలనొప్పులు గురించి తెలుసుకుందాం.

మైగ్రేన్ తలనొప్పి
ఈ తలనొప్పి వచ్చిందంటే తొందరగా తగ్గకుండా కొన్ని రోజుల పాటు అలానే ఉండిపోతుంది. సాధారణంగా ఈ నొప్పి ఒక వైపు మాత్రమే వస్తుంది. కొంతమందికి వాంతులు,వికారం కూడా ఉంటాయి.

టెన్సన్ తలనొప్పి
ఈ తలనొప్పి తీవ్రమైన ఒత్తిడికి గురి అయినప్పుడు వస్తుంది. తల చుట్టూ తీవ్రమైన నొప్పి ఉంటుంది.

సైనస్ తలనొప్పి
ఈ తలనొప్పి ఉన్నప్పుడు కళ్ళ నొప్పులు,బుగ్గల నొప్పులు, తీవ్రమైన ఒత్తిడికి గురి అయినట్టు అనిపిస్తుంది. కొంత మందిలో పంటి నొప్పి ఉంటుంది. అలాగే కొన్ని వాసనలు పీల్చినప్పుడు ఇబ్బందులు ఏర్పడతాయి.

థండర్ క్లాప్ తలనొప్పి
ఈ తలనొప్పి తీవ్రంగానూ,అకస్మాత్తుగా వస్తుంది. ఈ తలనొప్పి ఒక నిమిషం నుండి 5 నిమిషాల్లోపు తగ్గిపోతుంది. అయితే ఈ తలనొప్పిని చాలా ప్రమాదకరంగా భావించాలి. ఈ తలనొప్పి వచ్చినప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.

క్లస్టర్ తలనొప్పి
ఈ తలనొప్పిలో ఒక కన్ను మాత్రమే నొప్పి పుడుతుంది. ఈ తలనొప్పి కారణంగా కన్ను ఎర్రబడి వాపు వస్తుంది. కంటి నుండి నీరు కారటం మరియు ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు ఉంటాయి. ఈ నొప్పి వచ్చినప్పుడు పావు గంట నుండి మూడు గంటల వరకు ఉంటుంది.

అలర్జీ తలనొప్పి
అలర్జీలు వచ్చినప్పుడు జలుబు,ముక్కు కారటం మరియు ఎక్కువగా తుమ్ములు వచ్చినప్పుడు ఈ తలనొప్పి వస్తుంది.

ఏరోప్లేన్ తలనొప్పి
ఈ తలనొప్పి ప్రతి పది మందిలో ఒక్కరికి ఉంటుంది. గాలి ఒత్తిడిలో మార్పు కారణంగా ఈ తలనొప్పి వస్తుంది.

శ్రమ తలనొప్పి
ఎక్కువగా శ్రమ చేసే వారిలో ఈ తలనొప్పి వస్తుంది. పనులు చేస్తున్నప్పుడు,వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఈ తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తలనొప్పి 5 నిమిషాల వరకు ఉంటుంది. అయితే కొంతమందిలో మూడు రోజుల వరకు కూడా ఉండవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.