Kitchenvantalu

Kitchen Hacks:పప్పుదినుసులకు పురుగు పట్టకుండా…ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి

Storage of Rice and pulses:మనం ఒక్కోసారి బియ్యం,పప్పులు వంటి వాటిని ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం. అలాంటి సమయంలో తొందరగా పురుగు పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వానా కాలంలో కూడా పప్పులు,బియ్యం వంటి వాటికీ చాలా తొందరగా పురుగు పట్టేస్తుంది. ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

పప్పులు,బియ్యం పోసే డబ్బాలో ఎండిన వేపాకులను వేస్తే పురుగు తొందరగా పట్టదు. అలాగే వెల్లుల్లి కూడా పురుగు పట్టకుండా నిరోదిస్తుంది. 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండా వేయాలి. ఈ రెండు చిట్కాలు బియ్యం,పప్పులు పురుగు పట్టకుండా చేస్తాయి. వేపాకులు,వెల్లుల్లి రెబ్బలను వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి.

అలాగే పప్పు దినుసులు ఉంచిన డబ్బాలో 3 ఎండుమిరపకాయలు ఉంచండి. ఎండు మిర్చీ ఘాటుకు పురుగులు పట్టకుండా ఉంటాయి. పప్పులు స్టోర్‌ చేసిన డబబ్బాలో 8-10 లవంగాలు వేసిన క్లాత్‌ బ్యాగ్‌ ఉంచండి. ఆ డబ్బాకు గాలి చొరబడకుండా చూసుకోండి.
Click Here To Follow Chaipakodi On Google News
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."