Healthhealth tips in telugu

Food For Eyes:వీటిని తీసుకుంటే కంటి నరాలు బలంగా ఉండి కంటి చూపు పెరుగుతుంది

Vision Problems Foods: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కంప్యూటర్స్ ముందు, సెల్ ఫోన్స్ తో గంటల తరబడి గడిపేస్తున్నారు. దాంతో కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. కంటికి సంబందించిన సమస్యలు రాకుండా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. అటువంటి ఆహారాల గురించి తెలుసుకుందాం. వీటిని తీసుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

క్యారెట్
క్యారెట్ లో బీటాకెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు లేకుండా కంటిచూపు మెరుగుదలకు సహాయపడుతుంది, వారంలో క్యారెట్ ని రెండుసార్లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి.

బచ్చలి కూర
దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, కెరొటినాయిడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఫైటో న్యూట్రియంట్స్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన కంటి శుక్లాలు తగ్గించడమే కాకుండా కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వారంలో రెండు నుంచి మూడు సార్లు ఆకుకూరను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

గుడ్లు
వీటిలో అవసరమైన అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో లుటీన్ ,జియాక్సంతిన్‌ సమృద్ధిగా ఉండటం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. రోజు ఒక గుడ్డు తినే విధంగా ప్లాన్ చేసుకోవాలి.

నట్స్
ప్రతి రోజు నట్స్ తీసుకుంటే వాటిలో ఉండే విటమిన్ E వాపులను తగ్గించటానికి మరియు కంటి శుక్లం ఏర్పడకుండా చేయటమే కాకుండా కంటికి ఏ సమస్యలు రాకుండా కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకుంటూ కొన్ని వ్యాయామాలు చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.