Beauty TipsHealth

Hair Care Tips:ఇలా చేస్తే చాలు…జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తుగా,పొడవుగా,ఆరోగ్యంగా పెరగటం ఖాయం

Onion and rice Hair Fall Tips In Telugu : వాతావరణంలో కాలుష్యం,మారిన జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయస్సులోనే జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తున్నాయి. జుట్టు సమస్యలను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. దాని వల్ల తాత్కాలికంగా ఫలితం ఉన్నా కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంటిలో ఉండే సహజ సిద్దమైన పదార్ధాలతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

మూడు స్పూన్ల బియ్యాన్ని నీటిలో మూడు గంటల పాటు నానబెట్టి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టాలి. ఒక బౌల్ లో 2 స్పూన్ల ఉల్లిపాయ రసం, ఒక స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బియ్యం నీటిలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దీనిలో మనం రెగ్యులర్ గా వాడే షాంపూ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమంతో వారంలో రెండు సార్లు తల రుద్దుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా జుట్టు కుదుళ్లకు పోషణ అంది జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.బియ్యం నీటిని జుట్టు సంరక్షణలో పూర్వ కాలం నుండి ఉపయోగిస్తున్నారు. బియ్యం నీటిలో ఉండే పోషకాలు జుట్టు రాలే సమస్యను అత్గ్గిస్తాయి.

ఉల్లిరసంలో ఉండే పోషకాలు తల మీద చర్మం మీద ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది. దాంతో చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. కాఫీ పొడి జుట్టు ముదురు రంగులో ప్రకాశవంతంగా మెరవటానికి సహాయ పడుతుంది. షాంపూ తల మీద దుమ్ము,ధూళి తొలగించటంలో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.