Soap Nuts:కుంకుడు కాయ వలన కలిగే లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు…ఇది నిజం
kunkudkaya(Soap Nuts) Benefits in telugu : సపిండేసి కుటుంబానికి చెందిన కుంకుడు చెట్టు నుండి కుంకుడు కాయలు లభ్యం అవుతాయి. కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం ఉపయోగిస్తారు. కుంకుడు కాయలోని సెపోనిన్ కారణంగా నురుగ తయారై తలపైనున్న మలినాలు,దుమ్ము,ధూళి తొలగిపోయి వెండ్రుకలు శుభ్రపడతాయి.
కుంకుడుకాయలను వాడాలంటే ఒకప్పుడు కొంత శ్రమ ఉండేది. ఆ కాయలను చితక్కొట్టి, వాటిలో గింజలను తీసెయ్యాలి. వాటిని వేడి నీటిలో నానపెట్టి… ఆ రసంతో తలరుద్దుకునేవారు. కానీ ఈ రోజుల్లో పొడి రూపంలోనూ మరియు షాంపూ రూపంలోనూ దొరుకుతుంది. కానీ కుంకుడు కాయలు వాడితేనే మంచిది. కుంకుడు కాయ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.
తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడడం ఇంకా మంచిది. ఇప్పుడు కుంకుడు కాయలో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొదట చర్మ ప్రయోజనాల
గురించి తెలుసుకుందాం.
కుంకుడు కాయలో సహజమైన కండిషనింగ్ లక్షణాలు ఉన్నాయి, అందువల్ల చర్మాన్ని తేమగా మార్చి పొడిబారకుండా సహాయ పడుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు కుంకుడు కాయ వాడితే మంచిది. లేకపోతె కుంకుడుకాయ నుండి తయారైన ఉత్పత్తులను అయినా వాడవచ్చు. అద్భుతమైన క్లేన్సర్ గా పనిచేస్తుంది. సబ్బుకి బదులుగా కుంకుడుకాయను వాడవచ్చు.
చర్మాన్ని చల్లబరచటమే కాకుండా శుభ్రపరుస్తుంది. కుంకుడు కాయ రసంలో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలిపి పేస్ వాష్ గా వాడవచ్చు. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి కుంకుడు కాయ చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
తామర, సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధులను పరిష్కరించడంలో సహాయపడతాయి. శిశువులలో డైపర్ దద్దుర్లు నయం చేయడానికి కుంకుడు రసాన్ని వాడవచ్చు. అయితే ప్రభావిత ప్రాంతంలో రాయటానికి ముందు ప్యాచ్ పరీక్ష చేయాలి. ఇప్పటి వరకు చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జుట్టు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
జుట్టు ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది. కుంకుడుకాయను రసం రూపంలో గాని పొడి రూపంలో గాని వాడవచ్చు. ఈ మధ్య కాలంలో జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కుంకుడు కాయలో ఉండే విటమిన్ A, D, E, K జుట్టుని మృదువుగా,కాంతివంతంగా చేస్తాయి.
కుంకుడుకాయలో సహజసిద్ధమైన యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉండుట వలన బ్యాక్టీరియా మరియు ఇతర చర్మం ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. తలలో పేల సమస్యను తగ్గించటమే కాకుండా చుండ్రుని కూడా తొలగిస్తుంది. మంచి కండిషన్ గా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.