Kitchenvantalu

Kitchen Tips:ప్రతి ఇల్లాలికి ఉపయోగపడే సులభమైన వంటింటి చిట్కాలు

Kitchen Tips: ప్రతి ఒక్కరూ వంటింటిలో ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే వంట చాలా సులభంగా అవ్వటమే కాకుండా చాలా తక్కువ సమయంలో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చు.

పనస పండు తొనలు తీసే ముందు చేతులకు నూనె రాసుకుంటే జిగురు అంటుకోదు. చేతులకు జిగురు అంటుకుంటే ఒక పట్టానా వదలదు.

రాగి గిన్నెల జిడ్డు వదలాలంటే నిమ్మ తొక్కలకు రాళ్ల ఉప్పు చేర్చి రుద్దితే తెల్లగా మెరిసిపోతాయి.

మరమరాలు కరకరలాడాలంటే గంట సేపు ఎండలో ఆరబెట్టి తీయాలి.

కూలర్లో కొంచెం రోజ్ వాటర్ కలిపితే గదంతా సువాసన వస్తుంది.

దొండ, చామదుంప, ఆలూ వంటి కూరలు రుచిగా వుండాలంటే వేగించిన జీలకర్ర పొడిని చేర్చితే చాలు

వేసవిలో కూరగాయలు త్వరగా వడలి పోకుండా వుండాలంటే తడి వస్త్రంలో చుట్టి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటాయి.

గ్యాస్ స్టవ్ కొత్తదానిలా మెరవాలంటే నిమ్మకాయల డిప్పలను ఉడికించి …..ఆ నీటిలో స్పాంజిని ముంచి తుడవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.