Kitchenvantalu

Potato storage tips:బంగాళాదుంపలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే..బెస్ట్ టిప్స్

Potato storage Tips In telugu : బంగాళదుంపలను మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఆలూ కర్రీ, ఆలూ బిర్యానీ, కూర,ఫ్రై…ఇలా చెప్పుకుంటూ పోతే బంగాళదుంపలతో ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటూ ఉంటారు. బంగాళదుంప అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అందుకే చాలా మంది బంగాళదుంపలను ఎక్కువ మొత్తంలో కొంటూ ఉంటారు.

బంగాళాదుంప ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. బంగాళదుంపల్ని కొనే సమయంలో గట్టిగా ఉండేలా చూసుకోవాలి. కమిలిపోయినట్టు లేకుండా రంగు చక్కగా ఉండాలి. అప్పుడే బంగాళదుంప ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బంగాళదుంపను ఎండ తగలని ప్రదేశంలో స్టోర్ చేయాలి.

ఎండ తగిలితే తొందరగా పాడైపోతాయి. బంగాళదుంపలను నీటితో కడిగి నిలువ చేస్తే తొందరగా చెడిపోతాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు కలిపి నిలువ చేయకూడదు. ఎందుకంటే ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి మొలక వచ్చినా మిగతా వాటికి కూడా మొలకలు వచ్చే అవకాశం ఉంది. మొలకలు వచ్చిన లేదా ఆకుపచ్చని రంగులో ఉన్న బంగాళదుంపలను వాడకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.