Kitchenvantalu

Kitchen Tips:ప్రతి రోజు ఉపయోగపడే స్మార్ట్ వంటింటి చిట్కాలు

Smart Kitchen Tips In telugu :ప్రతి రోజు మనం చేసే పనిలో కొన్ని చిట్కాలను పాటిస్తే పని సులభం అవటమే కాకుండా శుభ్రం కూడా అవుతుంది. మనం ఎన్ని చిట్కాలను తెలుసుకున్నా సరే ఇంకా కొత్త కొత్త చిట్కాలను తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. అందువల్ల ఇప్పుడు అటువంటి స్మార్ట్ చిట్కాలను తెలుసుకుందాం.

గ్యాస్ స్టవ్ బర్నర్స్ శుభ్రం చేయటానికి సిరంజి నీడిల్స్ ఉపయోగిస్తే….బర్నర్స్ ని సులువుగా శుభ్రం చేయవచ్చు.

గాజు గ్లాసులను శుభ్రం చేసే నీటిలో కొంచెం బట్టలకు ఉపయోగించే బ్యూ కలిపితే గ్లాసులు తళతళ మెరుస్తాయి.

కరివేపాకును నూనెలో వేగించి చల్లారాక సీసాలో నిల్వ ఉంచుకుంటే….ఏదైనా కూర చేసుకున్నప్పుడు వేగించిన కరివేపాకు కలిపితే మంచి రుచి వస్తుంది.

పాత్రలపై ఉన్న స్టిక్కర్స్ సులభంగా ఊడాలంటే, ఆ స్టిక్కర్ కి కొవ్వొత్తి వేడి చూపితే సరిపోతుంది.

ఆకుకూరలు తాజాగా ఉండాలంటే తడిబట్టలో చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాలి.

కాకరకాయ చేదు పోవాలంటే కాకరకాయ వండే సమయంలో పచ్చి మామిడి కాయ ముక్కలు వేస్తే కాకరకాయ చేదు పోవటమే కాక కూర మంచి రుచి వస్తుంది.

కంప్యూటర్ కీ బోర్డ్, మౌస్ వంటి వాటిపై పడిన మరకలను నెయిల్ ఫాలిష్ రిమూవర్ తో సులభంగా తొలగించవచ్చు.

సమోసాలు కరకరలాడాలంటే….పిండి కలిపే సమయంలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.