White hair Turn Black:4 కుంకుడు కాయలతో ఇలా చేస్తే మీ తెల్ల జుట్టుని శాశ్వతంగా నల్లగా మార్చుకోవచ్చు
White hair Home Remedies in telugu: మారిన జీవనశైలి పరిస్థితి, వాతావరణంలో కాలుష్యం,ఒత్తిడి, ఎక్కువగా కెమికల్స్ ఉన్న ఉత్పత్తులను వాడటం వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వస్తుంది. దీని కోసం ఖరీదైన నూనెలు,హెయిర్ డ్రై లను వాడవలసిన అవసరం లేదు.
చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. దీని కోసం ఒక పాన్ లో అరకప్పు ఎండిన ఉసిరి ముక్కలు, నాలుగు కుంకుడు కాయలు,6 శీకాయలు వేసి బాగా వేడిగా ఉన్న నీటిని పోసి నాలుగు గంటల పాటు నానబెట్టాలి.
ఆ తర్వాత ఈ పాన్ ని పొయ్యి మీద పెట్టి అరగంట పాటు సిమ్ లో ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారాక చేతికి gloves వేసుకొని ఉసిరి,కుంకుడు కాయలు, శీకాయలను మెత్తగా చేయాలి. అప్పుడే వాటిలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ నీటిలో ఉన్న పిప్పిని మొత్తం తీసేయాలి. ఆ తర్వాత దాదాపుగా 3 స్పూన్ల హెన్నా పొడి కలపాలి.
ఆ తర్వాత రెండు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి రెండు గంటలు అయ్యాక సాదరణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం హెర్భల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


