Healthhealth tips in telugu

ఆల్కహాల్ లో ఇది కలిపి చెవిలో కొన్ని చుక్కలు వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..

Health Tips:మ‌న శ‌రీరంలో ప‌లు జీవ క్రియ‌ల ఫ‌లితంగా విడుద‌ల‌య్యే వ్య‌ర్థ ప‌దార్థాలు అనేకం ఉన్నాయి. వాటిలో చెవుల్లో పేరుకుపోయే గులిమి కూడా ఒక‌టి. సాధార‌ణంగా గులిమిని మ‌నం ప్ర‌త్యేకంగా ఇయ‌ర్ బ‌డ్స్ పెట్టి తీయాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఎక్కువగా పేరుకుపోయిన గులిమి దానిక‌దే ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది.

కానీ కొంద‌రు మాత్రం అలా కాదు. చెవుల్లో ఉన్న గులిమిని తీయ‌కుండా నిలిచి ఉండ‌లేరు. అయితే అలా గులిమిని తీయ‌డం మాత్రం ప్ర‌మాద‌క‌ర‌మేనంటున్నారు వైద్యులు. ఎప్ప‌టిక‌ప్పుడు చెవుల్లో గులిమి వెళ్లిపోతుంటే ఫ‌ర్వాలేదు. కానీ అలా వెళ్ల‌కుండా అలాగే పేరుకుపోయి ఉండి, పైకి క‌నిపిస్తూ ఉంటే మాత్రం గులిమిని తీయాల్సిందే.

కానీ పైన చెప్పిన‌ట్టుగా ఇయ‌ర్ బ‌డ్స్‌తో మాత్రం కాదు. అందుకు ఓ సింపుల్ మెథ‌డ్ ఉంది. అదేమిటంటే…ఒక చిన్న‌పాటి సీసా తీసుకుని అందులో స‌గం వ‌ర‌కు వైట్ వెనిగ‌ర్‌తో నింపాలి. అనంత‌రం మ‌రో స‌గాన్ని ర‌బ్బింగ్ ఆల్క‌హాల్‌తో ఫిల్ చేయాలి. త‌రువాత రెండింటినీ బాగా క‌లిపి అందులోంచి కొన్ని డ్రాప్స్ తీసి స‌మ‌స్య ఉన్న చెవిలో వేయాలి.

అప్పుడు చెవిని ఓ వైపుకు వంచాలి. ఇలా ఒక నిమిషం పాటు ఉన్నాక త‌ల‌ను రెండో వైపుకు వంచి వేసిన డ్రాప్స్‌ను తొల‌గించాలి. అనంత‌రం స‌మ‌స్య అలాగే ఉంద‌నుకుంటే మళ్లీ ముందు చెప్పిన విధంగా చేయాలి.అయితే పైన చెప్పిన విధానం ఎంతో శ్రేయ‌స్క‌రం.

అయిన‌ప్ప‌టికీ దాన్ని రెండు, మూడు సార్లు పాటించాక కూడా స‌మ‌స్య అలాగే ఉంటే వెంట‌నే ఆ ప్ర‌య‌త్నాన్ని మాని వైద్యుని వ‌ద్ద‌కు వెళ్ల‌డం మంచిది. లేదంటే చెవిలో అత్యంత సున్నితంగా ఉండే ప్రాంతాలు దెబ్బ‌తినేందుకు అవ‌కాశం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.