Kitchenvantalu

Kitchen Tips: ఇలా శుభ్రం చేస్తే చాలు.. మీ కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ మిలమిల మెరుస్తుంది

Kitchen Cleaning Tips in telugu:వంటగది శుభ్రంగా ఉండాలంటే ముందుగా కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. వంటగదిలో వంట చేసే సమయంలో కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌ లను ఎక్కువగా వాడుతూ ఉంటాం. కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ శుభ్రంగా లేకపోతే వంట చేయటానికి కష్టంగా ఉంటుంది.

అలాగే బొద్దింకలు,ఈగలు వంటివి వచ్చి తెగ ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ సీజన్ లో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. వంట పూర్తీ అయినా తర్వాత నీళ్లలో వెనిగర్‌ కలిపి కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ ని శుభ్రం చేస్తే సరిపోతుంది.

కిచెన్ లో నూనె ఒలికినప్పుడు గోధుమ పిండి లేదా వంటింటిలో ఉండే ఏ పిండిని అయినా ఐదు నిమిషాల తరువాత పేపర్‌తో తుడిస్తే నూనె పడిన ప్రాంతం జిడ్డు లేకుండా శుభ్రం పడుతుంది.

కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై మరకలు ఉంటే.. బేకింగ్‌ సోడా వేసిన నీళ్లతో తుడిస్తే వెంటనే తొలగుతాయి. దుర్వాసన కూడా ఉండదు. దీన్ని శుభ్రం చేసేందుకు బ్లీచింగ్‌, అమోనియా వంటి వాటిని అస్సలు వాడకూడదు. ఒకవేళ వాటిని ఉపయోగిస్తే క్యాబినేట్‌కున్న రంగులు, టైల్స్‌ దెబ్బతింటాయి.

కూరగాయలు తరిగిన తర్వాత వాటి చెత్త అంతా ఎప్పటికప్పుడు ఒక డబ్బాలో వేసుకొని ఆ తర్వాత చెత్తడబ్బాలో పాడేయాలి. ఇలా చేస్తే కిచెన్ ప్లాట్‌ఫామ్‌ మీద తేమ,మరకలు లేకుండా శుభ్రంగా ఉంటుంది.

వంట పూర్తైన తర్వాత.. సింక్ శుభ్రం చేసుకుంటే.. వైరస్‌, బ్యాక్టీరియాలు వృద్ధి చెందకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు సింక్‌లో మాంసాహారం కడిగిన తర్వాత దాన్ని సోప్‌ వాటర్‌తో శుభ్రం చేయండి. ఇలా చేస్తే.. దుర్వాసన రాకుండా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News