Kitchenvantalu

Kitchen Tips : ప్రతి ఇల్లాలి కోసం వంటింటి చిట్కాలు.. తప్పక తెలుసుకుని పాటించండి..!

Kitchen Tips in telugu: ఈ రోజుల్లో కొన్ని పనులు పూర్తి చేయాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలా తొందరగా అవుతాయి. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవచ్చు. అలా చేయాలంటే ఇప్పుడు చెప్పే కొన్ని వంటింటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.

చపాతీలు రెండు రోజులు తాజాగా మెత్తగా మృదువుగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. మనం సాధారణంగా చపాతీ పిండిని కలపటానికి నీటిని వాడుతూ ఉంటాం. అలా నీటిని కాకుండా కొబ్బరి నీళ్లను పోసి కలిపితే చపాతీలు రెండు రోజుల పాటు తాజాగా ఉంటాయి.

ఒక్కోసారి ఆకుకూరలను ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం. ఈ సీజన్లో ఆకుకూరలు చాలా విరివిగా లభిస్తాయి. ఆకుకూరలను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి ఫ్రిజ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ఇడ్లీ, దోశ పిండి పులుపు రాకుండా ఉండాలంటే ఒక తమలపాకును వేస్తే నాలుగు రోజుల పాటు పులుపు లేకుండా తాజాగా ఉంటుంది. ఒక్కోసారి పిండిని ఎక్కువగా రుబ్బుతూ ఉంటాం. అలాంటి సమయంలో ఈ చిట్కా సహాయపడుతుంది.

సగ్గుబియ్యం వడియాలు తెల్లగా రావాలంటే సగ్గుబియ్యం వడియాలు పెట్టే సమయంలో సగ్గుబియ్యం ఉడికించినప్పుడు కొంచెం మజ్జిగ కలిపితే వడియాలు తెల్లగా వస్తాయి.

మిరపకాయ బజ్జీలు కరకరలాడుతూ రుచిగా ఉండాలంటే బజ్జీలు వేసే సమయంలో శనగపిండిలో రెండు స్పూన్ల నెయ్యి వేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News