Kitchenvantalu

Sprouts Poha:మొలకెత్తిన గింజలతో పోహా.. ఆరోగ్యానికి ఎంతో మేలు..

Sprouts Poha Recipe: మారుతున్న కాలంలో పోషకాల విలువ చాలా తగ్గిపోయింది. శరీరానికి అందవల్సిన పోషకాలను అందించలేకపోతున్నాం.అందుకే మన ఫుడ్ మెనులోకి హెల్తీ స్ప్రౌట్స్,కూరగాయలు యాడ్ చేసుకోవాలి. అటుకులు,కూరగాయలు,స్ప్రౌట్స్ కలిపి పోహా చేసి చూడండి.

కావాల్సిన పధార్ధాలు
అటుకులు- 1.5 కప్పు
నూనె- 3టేబుల్ స్పూన్స్
పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్
ఆవాలు -1 టీస్పూన్
జీలకర్ర- 1 టీస్పూన్
ఎండుమిర్చి- 2
కరివేపాకు- 2 రెబ్బలు
ఉల్లిపాయ తరుగు- ¼ కప్పు
పచ్చిమిర్చి- 2
క్యారేట్ తరుగు- ¼ కప్పు
క్యాప్సికం తరుగు-1/4 కప్పు
టమాటో తరుగు – ¼ కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు-1/4 టీ స్పూన్
ఫ్రోజెన్ బఠానీ-1/4 కప్పు
మొలకలు- ½ కప్పు
చక్కెర- ¼ టీ స్పూన్
నీళ్లు- 4 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర – కొద్దిగా
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్

తయారి విధానం
1.అటుకులు జల్లించుకోని నీళ్లతో తడిపి జల్లి బుట్టలో వేసి పెట్టుకోండి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులో పల్లీలు వేపుకోవాలి.పల్లీలు వేగాక ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి.
3.వేగిన తాలింపులో ఉల్లిపాయ తరుగు ,పచ్చిమిర్చితరుగు,కరివేపాకు వేసుకోని కాస్త మెత్తపడనివ్వాలి.
4.మెత్తపడ్డ ఉల్లిపాయల్లోకి క్యారెట్,క్యాప్సికం,వేసుకోని మరో మూడు నిమిషాలు వేపుకోవాలి.

5.మగ్గిన క్యారెట్ లో బఠానీ,మొలకలు,టమాటోలు,ఉప్పు,పసుపు వేసి కలిపి మూతపెట్టుకోవాలి.
6.మూడు నిమిషాల తర్వాత అందులోకి అటుకులు వేసి టాస్ చేసుకోవాలి.
7.చివరగా కాస్త పంచదార వేసి అంచులవెంట నీళ్లు పోసి మూత పెట్టి మూడు నుండి నాలుగు నిమిషాలు ఆవిరి పై ఉడికించాలి.
8. అంతే నాలుగు నిమిషాల తర్వాత స్ప్రౌట్స్ పోహాని వేడి వేడిగా సెర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News