Kitchenvantalu

Vankaya Tomato Pachadi :వంట రాక‌పోయినా స‌రే ఈ ప‌చ్చ‌డిని ఎవ‌రైనా చేయ‌వ‌చ్చు.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే..

Vankaya Tomato Pachadi Recipe: ఎన్ని కూరలు ఉన్నా..పక్కన కాసింత పచ్చడి ,పల్చని చారు,ఆకర్లో మజ్జిగ ఉంటేనే భోజనం సంపూర్ణం. వంకాయ ,టమాట తో రోటి పచ్చడి చేసి పెట్టుకోండి..మొదటి ముద్ద అదిరిపోతుంది.

కావాల్సిన పధార్ధాలు
మెంతి కారం కోసం..
నూనె- 1.5 టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
మెంతులు – ½ టీ స్పూన్
ఎండుమిర్చి – 7-8
పచ్చిమిర్చి – 4-5
పచ్చి శెనగపప్పు – 1 టీ స్పూన్
మినపప్పు – 1 టీ స్పూన్
పచ్చడి కోసం..
లేత వంకాయలు- 300 గ్రాములు
టమాటోలు – 150 గ్రాములు
చింతపండు గుజ్జు – 2.5 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర – 1 కట్ట
ఉప్పు – తగినంత
నూనె – 3 టేబుల్ స్పూన్స్
తాలింపు కోసం..
నూనె – 1.5 టేబుల్ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు
ఎండుమిర్చి – 1
కరివేపాకు – 2 రెబ్బలు
జీలకర్ర – ½ టీ స్పూన్

తయారి విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి మెంతికారం కోసం తీసుకున్న పధార్ధాలన్ని వేసి వేపుకోని మెత్తని పొడి చేసి పెట్టుకోవాలి.
2.పచ్చడికోసం ప్యాన్ లో నూనే వేడి చేసి అందులోకి వంకాయ ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి.
3.మగ్గిన వంకాయల్లో టమాట ముక్కలు వేసి మరికాసేసు మగ్గనివ్వాలి.

4.టమాటోలు మెత్తపడ్డాక పసుపు,చింతపండు పులుసు,మెంతి కారం వేసి బాగా కలుపుకొని కొత్తి మీర తరుగు కూడ వేసుకోవాలి.
5.చల్లారకా మిక్సి జార్ లో వేసుకోని గ్రైండ్ చేసుకోవాలి.
6.తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపులు వేసుకోని వేగిన తాలింపును పచ్చడి లో కలుపుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News